ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశముందని సీఎం దృష్టికి వచ్చిందని ఎన్టీవీతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడించారు. దీంతో రాత్రి కర్ఫ్యూ అమలులో సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని… ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారని… కరోనా ఎన్ని వేవ్‌లు వచ్చినా…
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతికి 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. అయితే సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలోప్రత్యేక బస్సులు ఈ నెల 7 నుంచి 14 వరకు నడపనున్నట్టు వెల్లడించారు. 4,318 ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు నడుస్తాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా భారీ సంఖ్యలో టీఎస్…
‘ఆర్.ఆర్.ఆర్’ బాక్సాఫీస్ రేసు నుంచి తప్పుకోవడంతో చోటామోటా సినిమాలు అన్నీ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దాదాపు పది సినిమాలు అధికారికంగా సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించాయి. వాటితో పాటు కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా రానున్నాయి. వాటిలో అజిత్ నటించిన ‘వాలిమై’, విశాల్ ‘సామాన్యుడు’ కూడా ఉన్నాయి. ఇవి రెండూ కూడా మాస్ ఎంటర్ టైనర్స్ కావటమే ఏకైక ప్లస్ పాయింట్. నిజానికి అజిత్, విశాల్ కి తెలుగులో మార్కెట్ లేదు. విశాల్ కి ఒకప్పుడు ఉన్న…
సంక్రాంతి పండుగకు రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ పలు ప్రాంతాలకు 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేశారు. జనవరి 7 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 362 ప్రత్యేక బస్సులు, బెంగళూరుకు 14, చెన్నైకు 20 ప్రత్యేక బస్సులు…
ఈ నెలలో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతి పండుగలను రానున్నాయి… సంక్రాంతి పండుగ అంటే తెలుగు లోగిళ్లలో సందడి వాతావరణం నెలకొంటుంది.. పట్టణాలను వదిలి.. అంతా పల్లెబాట పడతారు.. దీంతో.. అసలైన పండుగ గ్రామాల్లోనే కనిపిస్తోంది.. ఇక, క్రిస్మస్, సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని స్కూళ్లకు ఈనెల 23 నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానుండగా.. జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు మొదలుకానున్నాయి.. క్రిస్మస్ సెలవులు ఈ నెల 23 నుంచి 30వ…