Boat Racing Competition: సంక్రాంతి పండుగ సందరర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నిర్వహిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ పడవల పోటీలు కనువిందుగా సాగుతున్నాయి. కేరళను తరిపించే విధంగా పచ్చని కొబ్బరి చెట్లు మధ్యలో గోదావరి నదిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ప్రకృతి రమణీయమైన దృశ్యాల మధ్య మూడురోజుల పాటు పడవల పోటీలు జరుగనున్నాయి.
Read Also: Breaking: వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా
బొబ్బర్లంక-ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో ఈ పడవల పోటీలు నిర్వహిస్తున్నారు. కేరళలో మాత్రమే జరిగే ఈ తరహా పోటీలను మొట్టమొదటి సారి కోనసీమలో నిర్వహించడంతో. పోటీలను తిలకించడానికి వచ్చిన కోనసీమ వాసులు కేరింతలు పడుతున్నారు. శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా పడవ పోటీలు జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పడవ పోటీలను నిర్వహించనున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొబ్బర్లంక- ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో పడవల పోటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.