మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమి మెజారిటీ సాధించిన తర్వాత సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే పేరును తమ పార్టీ ప్రతిపాదించిందని ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కానీ దాన్ని బీజేపీ పార్టీ తిరస్కరించింది అని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ చేసిన క్విట్ ఇండియా వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వీట్ ఇండియాతో బీజేపీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పూర్వీకులు క్విట్ ఇండియాలో కూడా పాల్గొనలేదని తెలిపారు.
Read Also: Indrakaran Reddy: ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చారు..
2014లో బీజేపీ పార్టీ తమ పార్టీతో పొత్తును తెంచుకుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా.. మన దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని.. అందువల్ల ఇది ఇప్పటికైనా హిందూ రాష్ట్రంగా ఉందని కమల్ నాథ్ అన్నారని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ చెప్తుంది.. బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి ఏం చేస్తుందని ఆయన అడిగారు.
Read Also: Rahul Gandhi: భారత్ జోడో యాత్ర వల్లే నాలో అహంకారం పోయింది..
క్విట్ ఇండియా ప్రారంభమైన రోజును పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, వంశపారంపర్యత, బుజ్జగింపులకు వ్యతిరేకంగా భారతదేశం ఇప్పుడు ఒకే స్వరంలో మాట్లాడుతోందని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహనీయులకు నివాళులు.. గాంధీజీ నాయకత్వంలో ఈ ఉద్యమం భారతదేశాన్ని వలస పాలన నుంచి విముక్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిందని మోడీ ట్వీట్ చేశారు. దీని స్ఫూర్తితో నేడు దేశం మొత్తం అన్ని దురాచారాలకు చెక్ పెడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.