కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ మోషెన్ రాజు, జూపూడి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై విరుచుకుపడ్డారు. చాలా మంది బ్లడ్ రిలేషన్ కూడా కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, కొందరు కొత్త వాళ్ళు జగన్ ను దించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చిందని తెలిపారు. సామాజిక సాధికారత సాధించామన్నారు. కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన నాయకుడు చంద్రబాబు అని మంత్రి మేరుగ మండిపడ్డారు. పేదవాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడమే సామాజిక న్యాయమని మంత్రి పేర్కొన్నారు.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నెల్లూరు చేపల పులుసు అంటే ఎంత ఫేమసో.. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ అన్న అంత ఫేమస్ అంటూ అలీ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ కోసం జగన్ ఎంతో చేస్తున్నారని ఆయన చెప్పారు.
మచిలీపట్నంలో వైసీపీ సామాజిక సాధికార యాత్రలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50 శాతం ఛాన్స్ ఇచ్చారు.. 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బీసీలమైన మేము జీరోలుగా ఉన్నాం.. మీ దృష్టిల్లో సున్నాలమైన మమ్మల్ని సీఎం జగన్ లీడర్లను, మంత్రులను చేశారు.
గడచిన 75 సంవత్సరాల పాలన కంటే సీఎం జగన్ పాలన భిన్నమైనది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చాలనేదే జగన్ తాపత్రయం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది రాజకీయ అవకాశం కల్పించాలని ఉద్యమాలు చేశారని మంత్రి చెప్పారు.
విశాఖపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం, అభివృద్ధికి దూరంగా ఉన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మైనార్టీలను టీడీపీ కూరలో కరివేపాకులా వాడిందని ఆయన మండిపడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభకు మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు నందిగాం సురేష్, సినీ నటుడు ఆలీ, శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషెన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, అలీ పాల్గొన్నారు. అందులో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను రాష్ట్రానికి నాలుగు దిక్కులుగా సీఎం జగన్ భావిస్తారని తెలిపారు. అలాంటి జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత అణగారిన వర్గాలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.