నేడు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఈ బస్సు యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నారు. జగన్ సర్కార్ చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి వైసీపీ నాయకులు తీసుకెళ్తున్నారు. ఇక, నేడు ప్రకాశం జిల్లా కనిగిరిలో సామాజిక సాధికారిక యాత్ర కార్యక్రమం కొనసాగనుంది.
వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ దొరుకుతుంది. నేడు 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది.
వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఓడించారు అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయేలా ప్రజలు చేయాలి..
సీఎంగా మళ్లీ జగన్ ని చేస్తేనే భవిష్యత్ బాగుంటుందని వ్యాఖ్యనించారు. చారిత్రక అవసరం ఉంది.. అలా కాకుంటే దేశం కుడా క్షమించదు అని ఆయన పేర్కొన్నారు. సామాజిక సాధికార యాత్రనే కాదు స్వాభిమాన యాత్ర కూడా అని స్పీకర్ తమ్మినేని సీతారం చెప్పారు.
సీఎం జగన్ పేదల కోసం ఆలోచిస్తే, చంద్రబాబు దృష్టి అంతా ధనవంతులు, దోపిడిదారులపై ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు. పేద, ధనిక మద్య అంతరాలను తొలగించాలనే మార్పు జగన్ చేస్తున్నారు.. దేశంలో ఇతర ప్రాంతాలు కూడా అనుసరించాల్సిన పాలన ఇస్తున్నాం.
న్నికల కోసం దుష్ట చతుష్టయం సిద్దం అవుతున్నారు.. పక్క వ్యక్తి సీఎం అవ్వాలని పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి దత్త పుత్రుడు అంటూ అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ను దింపడం పవన్ తరం కాదు అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.