గడచిన 75 సంవత్సరాల పాలన కంటే సీఎం జగన్ పాలన భిన్నమైనది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చాలనేదే జగన్ తాపత్రయం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది రాజకీయ అవకాశం కల్పించాలని ఉద్యమాలు చేశారని మంత్రి చెప్పారు. అన్ని వర్గాలకు అధికారం కట్టబెట్టిన వ్యక్తి కేవలం ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే.. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే ఇలా చేయగలరు.. గత ప్రభుత్వంలో మైనార్టీలు, గిరిజనులకు కనీస అవకాళం కల్పించ లేదు అంటూ ఆయన మండిపడ్డారు. పేదల కన్నీళ్లు తుడిచి ఆకలి తీరుస్తుంటే చంద్రబాబు చూసి బాధపడుతున్నాడు.. ప్రభుత్వ డబ్బంతా ఖర్చైపోతోందని గగ్గోలు పెడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడం మామూలు విషయం కాదు.. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏప్పుడైనా జరిగిందా ఇలా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
Read Also: Bandi Sanjay: మరికొద్ది గంటల్లో పోలింగ్.. బండి సంజయ్ సంచలన ప్రకటన..!
రూ. 12,800 కోట్లు ఖర్చు చేసి పేదలకు ఇంటి స్థలాలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఊళ్లకు ఊళ్లు నిర్మాణాలను తమ ప్రభుత్వం చేస్తుంది.. చంద్రబాబు పేదవాడి కోసం ఒక్క సెంటు స్థలమైనా కొన్నాడా?, పథకాలను ఓట్లతో ముడిపెట్టడం ఆయనకి అలవాటు.. ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ విద్య ఎదగడానికి కారణం ఎవరు.. సీఎం జగన్ వచ్చాక ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం పెరిగిందని ఆయన వెల్లడించారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మొత్తం మార్చారు.. అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడో చంద్రబాబు చెప్పగలడా?, అస్సలు ఎందుకు చంద్రబాబుకి ఓటేయాలి అనేది చెప్పాలి అని డిమాండ్ చేశారు. నాలుగేళ్లు ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చంద్రబాబు వేస్ట్ అని విమర్శలు గుప్పిస్తున్నాడు.. ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటే ఎక్కువ ఎలా ఇస్తాడు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.