వివాదాస్పద రియాలిటీ షో ‘బిగ్ బాస్-15 ( బిగ్ బాస్ ఎల్ 5) ఓటిటిలో ప్రజలను సూపర్ గా అలరిస్తోంది. తాజాగా ఈ షో నుంచి బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త వచ్చింది. ‘బిగ్ బాస్’ సీజన్ 15 త్వరలో టీవీలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ ను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయబోతున్నాడు. ప్రేక్షకుల్లో షోపై నెలకొన్న ఉత్సుకతను చూసి మేకర్స్ ‘బిగ్ బాస్-15’ షో ప్రోమో విడుదల చేశారు. కలర్స్ టీవీ “బిగ్ బాస్ 15”…
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ‘షేర్ షా’ మూవీ రూపొందింది. ఇందులో దివంగత కెప్టెన్ విక్రమ్ బాత్రాగా సిడ్ నటించాడు. అయితే, ఏ కొంచెం తేడా వచ్చినా అద్భుతమైన పాత్ర బాలీవుడ్ యంగ్ హీరో చేతిలోంచి జారిపోయి ఉండేదట! అందుక్కారణం సల్మాన్ ఖాన్ అంటున్నాడు ‘షేర్ షా’ నిర్మాత షబ్బీర్ బాక్స్ వాలా…‘షేర్ షా’ మూవీ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందించాలని మేకర్స్ డిసైడ్ అయినప్పుడు సల్మాన్ తన బావమరిదిని హీరోగా తీసుకొమ్మన్నాడట! చెల్లెలి భర్త ఆయుష్…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత చిరంజీవి “లూసిఫర్” రీమేక్‌లో నటించబోతున్నారు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఒరిజినల్‌లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్ర కోసం సత్యదేవ్ ను తీసుకున్నారు. ఇప్పుడు పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం వేట మొదలైంది. సమాచారం మేరకు ఈ పాత్రలో ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ కన్పించబోతున్నాడట. మెగాస్టార్ చిరంజీవి తనకు స్నేహితుడైన సల్మాన్ ఖాన్‌ను…
బాలీవుడ్ లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సంజయ్ లీలా బాన్సాలీ. ఆయన సినిమాలో ఆఫర్ కోసం అగ్రశ్రేణి నటీనటులు కూడా అల్లాడిపోతుంటారు. అంతలా గ్రాండ్ గా తన మూవీస్ ని ప్రజెంట్ చేయటమే కాదు… తన యాక్టర్స్ ని కూడా బాన్సాలీ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. అయితే, ఆయన బ్రేక్ సంపాదించుకున్న తొలి చిత్రాల్లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ కూడా ఒకటి. అందులో ఐష్, అజయ్ దేవగణ్ తో పాటూ సల్మాన్ కూడా…
బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా కొన్ని మ్యూజికల్ హిట్స్ ఎప్పటికీ జనం మదిలో చెరగని ముద్ర వేసుకొనే ఉంటాయి. అలాంటి వాటిలో సల్మాన్ ఖాన్, మనీషా కొయిరాల జోడీగా నటించిన ‘ఖామోషీ’ని గుర్తు చేసుకోవచ్చు. నిజానికి ఈ సినిమా పేరు వినగానే వీరికంటే ముందుగా నానా పటేకర్, సీమా బిశ్వాస్ గుర్తుకు వస్తారు. ఇందులో మూగ, చెవిటి పాత్రల్లో ఆ ఇద్దరూ అద్భుతమైన అభినయం ప్రదర్శించారు. వారి కూతురుగా మనీషా నటన సైతం ప్రశంసలు అందుకుంది.…
అర్బాజ్ ఖాన్ చాట్ షో “పించ్ 2″లో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ అతిథిగా కన్పించారు. ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై సెలబ్రిటీలు స్పందించడానికి ఈ కార్యక్రమం ఒక వేదిక. రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా సాగింది. జూలై 21న ప్రీమియర్ అయిన “పించ్ సీజన్ 2″లో సల్మాన్ ఖాన్ మొదటి అతిథి. దుబాయ్‌లో తనకు భార్య, కుమార్తె ఉన్నట్లు సోషల్ మీడియా యూజర్ చేసిన వాదనపై భాయ్ స్పందించారు. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ హాట్ సీటుపై…
మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసా? బాలీవుడ్ ‘భాయ్ జాన్’తో రొమాన్స్ చేస్తోంది. అఫ్ కోర్స్, బీ-టౌన్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పూజా మూవీ చేస్తోంది. అయితే, సల్మాన్ తో సరసాలాడుతోన్న ఈ దక్షిణాది సామజవరగమన కండల వీరుడ్ని పొగడకుండా ఆగలేకపోతోంది. సల్లూ భాయ్ గురించి మాట్లాడుతూ “సల్మాన్ కు మీరు నచ్చితే నచ్చేస్తారు! నచ్చకపోతే ఇక నచ్చరంతే!” అంటోంది. ‘దబంగ్’ ఖాన్ లాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండటం…
‘బజ్రంగీ భాయ్ జాన్’ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించి ఉంటే ఎలా ఉండేది? ఇదేం సంబంధం లేని ప్రశ్న అనుకుంటున్నారా? లింక్ ఉంది… అదేంటంటే…రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘బజ్రంగీ భాయ్ జాన్’ మూవీకి స్టోరీ రైటర్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, సల్మాన్ నటించిన క్రాస్ బార్డర్ ఎమోషనల్ స్టోరీ ఆయన ముందుగా రాజమౌళికే చెప్పాడట. కానీ, అప్పట్లో ‘బాహుబలి’ బిజీలో ఉన్న జక్కన్న నాన్నగారికి ‘సారీ’ చెప్పేశాడట. దాంతో విజయేంద్ర ప్రసాద్ తన…
‘దబంగ్ 1, 2, 3 అండ్ 4’… ఏది మీకు బాగా ఇష్టం అనగానే… సల్మాన్ ‘దబంగ్ 4’ అంటూ సమాధానం ఇచ్చేశాడు! కానీ, అసలు ‘దబంగ్ 4’ మూవీనే రాలేదు కదా అంటారా? అది తెలియాలంటే సల్మాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ చాట్ షో ‘క్విక్ హీల్ పించ్’ గురించి తెలుసుకోవాలి!కొద్ది రోజుల క్రితం ‘క్విక్ హీల్ పించ్’ సీజన్ 2 మొదలైంది యూట్యూబ్ లో! దాదాపు అరగంట సేపు బీ-టౌన్ సెలబ్స్ ని ఒక్కొక్కర్ని…
బిగ్ బాస్ మళ్లీ మొదలవ్వబోతోంది! సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ 14 హడావిడి అప్పుడే మొదలైపోయింది. తాజాగా ఓ ప్రోమో కూడా వదిలారు షో నిర్వాహకులు. అయితే, ఈసారి కాస్త డిఫరెంట్ అప్రోచ్ ఉండనుంది. టీవీలో కంటే ముందుగా ఓటీటీలో అలరించబోతోంది వివాదాస్పద రియాల్టీ షో. కలర్స్ ఛానల్ లో ప్రసారం అవ్వటానికి ఆరు వారాల ముందు నుంచే వూట్ ఓటీటీలో బిగ్ బాస్ 14 సందడి మొదలైపోతుంది! Read Also : అభిమానుల…