సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ‘షేర్ షా’ మూవీ రూపొందింది. ఇందులో దివంగత కెప్టెన్ విక్రమ్ బాత్రాగా సిడ్ నటించాడు. అయితే, ఏ కొంచెం తేడా వచ్చినా అద్భుతమైన పాత్ర బాలీవుడ్ యంగ్ హీరో చేతిలోంచి జారిపోయి ఉండేదట! అందుక్కారణం సల్మాన్ ఖాన్ అంటున్నాడు ‘షేర్ షా’ నిర్మాత షబ్బీర్ బాక్స్ వాలా…
‘షేర్ షా’ మూవీ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందించాలని మేకర్స్ డిసైడ్ అయినప్పుడు సల్మాన్ తన బావమరిదిని హీరోగా తీసుకొమ్మన్నాడట! చెల్లెలి భర్త ఆయుష్ శర్మ పేరు భాయ్ జాన్ రికమెండ్ చేశాడట. కానీ, నిర్మాత షబ్బీర్ అప్పటికే సిద్ధార్థ్ ను వెండితెర విక్రమ్ బాత్రాగా ఎంచుకున్నాడు. ఆయనతో కెప్టెన్ విక్రమ్ బాత్రా ఫ్యామిలీ మెంబర్స్ కి మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు. వారు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ‘షేర్ షా’ మూవీకి పర్మిషన్ ఇచ్చారు. అదే విషయం ‘దబంగ్’ ఖాన్ కి వివరించారట ఫిల్మ్ మేకర్స్. సల్మాన్ కూడా సరేనన్నాడట. అంతే కాదు, ‘షేర్ షా’ మూవీలో ఒకవేళ నటించి ఉంటే ఆయుష్ శర్మకి అదే మొదటి చిత్రం అయ్యి ఉండేది! డెబ్యూ మూవీలో అంత బరువైన పాత్ర చేయటం రిస్క్ అని ఆయుష్ కూడా భావించాడట. అందుకే, ఆ ఆలోచన విరమించుకున్నారు ఖాన్ అండ్ శర్మ!
సిద్ధార్థ్ మల్హోత్రా కాకుండా ఆయుష్ శర్మ నటించి ఉంటే ‘షేర్ షా’ రిజల్ట్ ఎలా ఉండేదో… మనకైతే తెలియదు! కానీ, ఓటీటీలో డిజిటల్ గా రిలీజైన పాట్రియాటిక్ మూవీ ప్రస్తుతం రేవ్ రివ్యూస్ పొందుతోంది. సిడ్, కియారా బ్లాక్ బస్టర్ ని తమ ఖాతాలో వేసుకున్నారని చెప్పొచ్చు…