బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అన్ని భాషల్లోనూ విశేష ఆదరణతో దూసుకెళ్తోంది. అయితే ఇందులో ఉండే ఎలిమినేషన్ ప్రక్రియ అన్నింటికంటే ఆసక్తికరం. వారానికి ఓ వ్యక్తి హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అలా వాళ్ళను ఎలిమినేట్ చేయడం కోసం ‘బిగ్ బాస్’ అనుసరించే ప్రక్రియ ఆసక్తికరం. అయితే ఈసారి మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ మరింత కొత్తగా భావించాడు బిగ్ బాస్. అందుకే కొత్త ప్రోమోలో ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేయడానికి తాను వేసిన కొత్త పథకాన్ని…
దర్శక దిగ్గజం రాజమౌళి ముంబైలో తాజాగా సల్మాన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు ? సల్మాన్ ను రాజమౌళి ప్రత్యేకంగా కలవడానికి అసలు కారణం ఏంటి ? అనే విషయంపై టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. రాజమౌళి ప్రస్తుతం తన తాజా చిత్రం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అది జనవరి 7న భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పనుల్లో ముంబైలో బిజీగా ఉన్నాడు.…
తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఆయన నెక్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’కి రీమేక్. ఇటీవలే ఈ చిత్రం షెడ్యూల్‌ను ఊటీలో పూర్తి చేశారు. అయితే మెగాస్టార్ చేతికి చిన్న గాయం కావడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుందని…
బిగ్ బాస్ రియాలిటీ షో.. ప్రతి భాషలోను అదరగొడుతుంది. కంటెస్టెంట్ల మధ్య గేమ్స్.. వారి భావోద్వేగాలను బయటపెడుతున్నాయి. తాజాగా ఒక కంటెస్టెంట్ టాస్క్ ఓడిపోయినందుకు కోపంతో ఊగిపోతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనంగా మారింది. ఈ ఘటన హిందీ బిగ్ బాస్ సీజన్ 15 లో చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో అఫ్సానా ఖాన్ అనే కంటెస్టెంట్ సూసైడ్ అట్టెంప్ట్ చేసింది. ఈ ఘటనతో షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్లు ఉలిక్కిపడ్డారు. అసలు ఏం…
ఇటీవల ముంబైలో షిప్లో డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఆర్యన్ ఇప్పటికీ ఎన్‌సిబి అధికారుల అదుపులోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆదివారం షారూఖ్‌ని కలసి పరామర్శించారు. షారుఖ్ ఇంట్లో సల్మాన్ దాదాపు గంట టైమ్ స్పెండ్ చేశాడు. ఆర్యన్ అరెస్టుకు సంబంధించి షారూఖ్ ని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్, షారూఖ్ మంచి…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై ఓ కంపెనీ గేమ్ ను రూపొందించి వదిలింది. దీనికి యూజర్స్ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. కానీ అది సల్మాన్ ను మాత్రం కలవర పెట్టింది. తన పేరు మీద గేమ్ సృష్టించడం, అది కూడా పాపులర్ అవుతుండడం సల్మాన్ కు ఎందుకు ఆందోళన కలిగిస్తుంది ? అనే డౌట్ రావొచ్చు. కానీ ఆ గేమ్ సల్మాన్ ను కంగారు పెట్టేసింది మరి. విషయం ఏమిటంటే… సల్మాన్…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్’. ఓ పోలీస్ అధికారికి, గ్యాంగ్ స్టర్ కు మధ్య జరిగే క్లాష్ ఆధారంగా ఈ సినిమాను మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించబోతున్నారు. మంగళవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ‘చెడును అంతం చేసే శుభారంభం. గణపతి బప్పా మోరియా’ అంటూ సల్మాన్ ఖాన్ ఈ…
బాలీవుడ్లో తెరపై బెస్ట్ కపుల్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అందరినీ కట్టిపడేస్తుంది. ఒకానొకప్పుడు సల్మాన్, కత్రినా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు గట్టిగా పట్టుబట్టారు. పైగా వీరిద్దరూ డేటింగ్ అంటూ రూమర్లు కూడా వచ్చాయి. ఏమైతేనేం సల్మాన్ అభిమానుల కోరిక మాత్రం తీరలేదు. కానీ ఇప్పటికే సల్మాన్, కత్రినా జోడి వెండితెరపై కన్పిస్తే ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతుంటారు భాయ్ అభిమానులు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో “టైగర్-3”…
సల్మాన్ ఖాన్ ఇప్పుడు టర్కీలో తన గర్ల్ ఫ్రెండ్ తో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో బాలీవుడ్లో సింగర్ మారిన ఇయులియా వంతూర్ తాజాగా షేర్ చేసిన వీడియో ఈ రూమర్లకు కారణమైంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో టర్కిష్ హోటల్ లో ఉన్నట్లు తెలుపుతూ వీడియోను పంచుకుంది. Read Also : దీన్ని ఎవడు చేసుకుంటాడో…
(ఆగస్టు 30తో ‘సాజన్’కు 30 ఏళ్ళు పూర్తి) ప్రముఖ హిందీ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్ డిసౌజా దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ హిట్ ‘సాజన్’. మాధురీ దీక్షిత్ నాయికగా తెరకెక్కిన ఈ చిత్రంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ హీరోలుగా నటించారు. నదీమ్-శ్రవణ్ స్వరకల్పనలో రూపొందిన ‘సాజన్’ పాటలన్నీ ఎంతగానో అలరించాయి. ఈ చిత్రాన్ని సుధాకర్ బొకాడియా నిర్మించారు. 1991 ఆగస్టు 30న విడుదలైన ‘సాజన్’ ఆ యేడాది టాప్ గ్రాసర్ గా నిలచింది. ‘సాజన్’ కథలోకి తొంగి…