మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసా? బాలీవుడ్ ‘భాయ్ జాన్’తో రొమాన్స్ చేస్తోంది. అఫ్ కోర్స్, బీ-టౌన్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పూజా మూవీ చేస్తోంది. అయితే, సల్మాన్ తో సరసాలాడుతోన్న ఈ దక్షిణాది సామజవరగమన కండల వీరుడ్ని పొగడకుండా ఆగలేకపోతోంది. సల్లూ భాయ్ గురించి మాట్లాడుతూ “సల్మాన్ కు మీరు నచ్చితే నచ్చేస్తారు! నచ్చకపోతే ఇక నచ్చరంతే!” అంటోంది. ‘దబంగ్’ ఖాన్ లాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండటం అందరి వల్లా కాదని చెబుతోంది మిస్ హెగ్డే. మనసులో ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చూపటమే ఆయన ప్రత్యేకతట!
హిందీలో సల్మాన్ తో ‘భాయ్ జాన్’ మూవీ చేస్తోన్న పూజా ‘సర్కస్’ చిత్రంలో రణవీర్ సింగ్ తో జోడీ కట్టింది. ముంబై స్టార్ హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోన్న ఆమె బాలీవుడ్ ఆడియన్స్ కు తన టాలెంటో ఏంటో చూపించాలని తాపత్రయపడుతోందట. అదే సమయంలో, తమిళంలో ఇళయదళపతి విజయ్ తో ‘బీస్ట్’ మూవీ చేస్తోంది ఈ బ్యూటీ. కోలీవుడ్ వద్దకొచ్చే సరికి చాలా ఏళ్ల గ్యాప్ తరువాత చెన్నైకి తిరిగొచ్చింది చిన్నది. అందుకే, తంబీలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని పూజకి టెన్షన్ గా ఉందట!
అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్, విజయ్, అక్షయ్ కుమార్, సల్మాన్… ఇలా వివిధ సినిమా రంగాల్లోని సీనియర్ స్టార్స్ తో బెంగుళూరు భామ ఇప్పటికే జోడీ కట్టేసింది. వారి నుంచీ మన అందాల ‘అమూల్య’ అమూల్యమైన పాఠాలే నేర్చుకున్నానంటోంది. టాప్ హీరోల నుంచీ యాక్టింగ్ లో మెలకువలు మాత్రమే కాదు వారి లైఫ్ లెసన్స్ కూడా పూజా షూటింగ్ సమయాల్లో ఒంట బట్టించుకుంటుందట! మొత్తానికి కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ బేబీ… టాలీవుడ్ టూ బాలీవుడ్ ప్రతీ చోటా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హీరోలందరికైతే హాట్ ఫేవరెట్ గా మారిపోయింది!