అమితాబ్ కార్ సీజ్… కారణం సల్మాన్ ఖాన్ !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కర్ణాటకలోని బెంగళూరులో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వాహనాల భీమా గడువు ముగియడం. పన్ను చెల్లించని లగ్జరీ వాహనాలపై దృష్టి పెట్టింది కర్ణాటక రవాణా శాఖా. అందులో భాగంగానే జప్తు చేసిన 7 లగ్జరీ వాహనాలలో 5 పుదుచ్చేరిలో రిజిస్టర్ చేయబడ్డాయి. మహారాష్ట్రలో రెండు నమోదయ్యాయి. అయితే స్వాధీనం చేసుకున్న వాహనాల్లో చాలా వరకు పూర్తి పత్రాలు లేవు. బీమా కూడా లేదు. వీటిలో చాలా వాహనాల బీమా గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కారును కూడా సీజ్ చేశారు రవాణా శాఖ అధికారులు. పైగా ఈ కారు నడుపుతుంది అమితాబ్ కావడం అసలు ట్విస్ట్. వివరాల్లోకి వెళ్తే…
కర్ణాటక రవాణా శాఖ MH 02 BB 2 నంబర్ ప్లేట్ ఉన్న రోల్స్ రాయిస్-ఫాంటమ్ కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే అది అమితాబ్ బచ్చన్ పేరు మీద ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. 2007 సంవత్సరంలో ‘ఏక్ లవ్య’ చిత్రం విడుదలైన తర్వాత విధు వినోద్ చోప్రా ఈ కారును అమితాబ్ బచ్చన్‌కు బహుమతిగా ఇచ్చారు. 2019 సంవత్సరంలో బిగ్ బి ఈ రోల్స్ రాయిస్-ఫాంటమ్ కారును యూసుఫ్ షరీఫ్ అనే వ్యక్తికి అమ్మేశారు. అయితే కారుకు సంబంధించిన పత్రాలు మాత్రం ఇంకా అమితాబ్ పేరు మీదే ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కారు నడుపుతున్న వ్యక్తి పేరు సల్మాన్ ఖాన్. 35 ఏళ్ల సల్మాన్ తన తండ్రి ఈ కారును అమితాబ్ బచ్చన్ నుండి కొనుగోలు చేసినట్లు పోలీసులకు చెప్పాడు.
Also Read
- Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? 'ఇరుముడి' సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
- Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
- Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
నిబంధనల ప్రకారం ఇతర రాష్టాల నుంచి తీసుకొచ్చిన కార్లను ఆ రోజు నుంచి 11 నెలల లోపు స్థానిక రవాణా శాఖా ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ వాహనాన్ని మరొక రాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్‌తో నడపడానికి అనుమతించరు. కానీ ఈ కారు అమితాబ్ బచ్చన్ నుండి ఫిబ్రవరి 27, 2019న కొనుగోలు చేశారు. కారు యజమాని దీనికోసం దాదాపు రూ.6 కోట్లు చెల్లించినట్లు చెప్పాడు. అయితే ఆయన దగ్గర కారుకు సంబంధించి అధికారులకు చూపించాల్సిన డాక్యూమెంట్స్ లేవు. కానీ బచ్చన్ ద్వారా వచ్చిన బదిలీ లేఖను చూపించాడు.
తాజావార్తలు
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!