అర్బాజ్ ఖాన్ చాట్ షో “పించ్ 2″లో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ అతిథిగా కన్పించారు. ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై సెలబ్రిటీలు స్పందించడానికి ఈ కార్యక్రమం ఒక వేదిక. రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా సాగింది. జూలై 21న ప్రీమియర్ అయిన “పించ్ సీజన్ 2″లో సల్మాన్ ఖాన్ మొదటి అతిథి. దుబాయ్‌లో తనకు భార్య, కుమార్తె ఉన్నట్లు సోషల్ మీడియా యూజర్ చేసిన వాదనపై భాయ్ స్పందించారు. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ హాట్ సీటుపై కనిపిస్తాడు.
Read Also : సూపర్ ఫాస్ట్ గా హిస్టరీ క్రియేట్ చేసిన సూపర్ స్టార్
ఈ హీరో రూపాన్ని ఎగతాళి చేస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడటం, అతను జాకీ ష్రాఫ్ కుమారుడు ఎలా అవుతాడని అర్బాజ్ ఖాన్ ప్రశ్నించడం చూడవచ్చు. ఇక ఈ షోలో భాగంగా “మీరు వర్జిన్ నా ?” అంటూ ఎదురైన ప్రశ్నకు టైగర్ చమత్కారంగా సమాధానం చెప్పడం వైరల్ అవుతోంది. “నేను కూడా సల్మాన్ భాయ్ లాగే వర్జిన్” అని టైగర్ చెప్పుకొచ్చాడు. 2013లో కరణ్ జోహార్ టాక్ షోలో సల్మాన్ తాను వర్జిన్ అని ప్రకటించడం అప్పట్లో నెట్టింట్లో చర్చకు దారి తీసింది. టైగర్ ఖాతాలో ప్రస్తుతం ‘బాఘీ 4’, ‘గణపత్’, ‘హీరోపంతి 2’ ఉన్నాయి.