వివాదాస్పద రియాలిటీ షో ‘బిగ్ బాస్-15 ( బిగ్ బాస్ ఎల్ 5) ఓటిటిలో ప్రజలను సూపర్ గా అలరిస్తోంది. తాజాగా ఈ షో నుంచి బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త వచ్చింది. ‘బిగ్ బాస్’ సీజన్ 15 త్వరలో టీవీలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ ను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయబోతున్నాడు. ప్రేక్షకుల్లో షోపై నెలకొన్న ఉత్సుకతను చూసి మేకర్స్ ‘బిగ్ బాస్-15’ షో ప్రోమో విడుదల చేశారు. కలర్స్ టీవీ “బిగ్ బాస్ 15” ప్రోమోను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ప్రోమోలో సల్మాన్ ఖాన్ ఒక అడవిలో కనిపిస్తాడు. రేఖ వాయిస్ బ్యాక్‌గ్రౌండ్‌లో విన్పిస్తుంది. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందా ? అని సల్మాన్ ఆలోచిస్తాడు. తీరా చూస్తే ఒక చెట్టు మాట్లాడుతుంది.
Read Also : నిక్ కు ప్రియాంక చోప్రా స్వీట్ సర్ప్రైజ్
చెట్టులో నుండి రేఖ వాయిస్ వస్తుంది. చెట్టు రూపంలో రేఖ, హోస్ట్ సల్మాన్ మధ్య సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఎప్పటిలా కాకుండా ఈసారి ప్రమోను సరికొత్తగా చేశారు. ప్రోమో చూస్తుంటే ఈసారి షో నేపథ్యం అడవిపై ఆధారపడి ఉండవచ్చని అనిపిస్తుంది. ‘బిగ్ బాస్’ ఇంటిని అడవికి అనుగుణంగా డిజైన్ చేయడం కూడా జరగవచ్చు. బిగ్ బాస్ 15 త్వరలో రాబోతోంది. ప్రస్తుతమైతే ‘బిగ్ బాస్’ ఓటిటి ప్లాట్‌ఫాం వూట్ లో 24 గంటలు ప్రసారం అవుతోంది. కరణ్ జోహార్ ‘బిగ్ బాస్ ఓటిటి’ ని హోస్ట్ చేస్తున్నారు. ‘బిగ్ బాస్ ఓటిటి’ నాలుగున్నర వారాల్లో ముగుస్తుందని, అది ముగిసే సమయానికి ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎంతమంది కంటెస్టెంట్‌లు మిగిలి ఉంటారో, వారికి రేఖ ‘బిగ్ బాస్ 15’ హోస్ట్ సల్మాన్‌ను పరిచయం చేస్తారని చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు ప్రోమో మాత్రం వైరల్ అవుతోంది.
A post shared by ColorsTV (@colorstv)