మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత చిరంజీవి “లూసిఫర్” రీమేక్‌లో నటించబోతున్నారు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఒరిజినల్‌లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్ర కోసం సత్యదేవ్ ను తీసుకున్నారు. ఇప్పుడు పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం వేట మొదలైంది. సమాచారం మేరకు ఈ పాత్రలో ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ కన్పించబోతున్నాడట. మెగాస్టార్ చిరంజీవి తనకు స్నేహితుడైన సల్మాన్ ఖాన్‌ను ఈ పాత్ర కోసం వ్యక్తిగతంగా సంప్రదించారట. ఒకవేళ ఆ కాల్ ఫలితం పాజిటివ్‌గా అయితే ఈ చిత్రానికి భారీ బిజ్ ఉంటుంది. దీనికి సంబంధించి ఆగస్టు 13 లోపు ప్రకటన చేయనున్నారట మేకర్స్. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో భాగం అవుతాడా లేదా అనేది అప్పుడే తెలుస్తుంది.
Read Also : “టక్ జగదీష్” డిజిటల్ డీల్ క్యాన్సిల్ ?
ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఆ పాత్రకు పచ్చ జెండా ఊపితే ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా అవుతుంది. మెగా స్టార్, సల్మాన్ ఖాన్ మధ్య చాలా సంవత్సరాలుగా మంచి అనుబంధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మెగాస్టార్ నెక్స్ట్ మూవీలో నటిస్తే అది తప్పకుండా మరో స్థాయికి వెళ్తుంది.