Somy Ali: మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిక్ హత్య తర్వాత మరోసారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగుతోంది. ఎప్పటి నుంచో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేస్తోంది. అయితే, సల్మాన్‌కి అత్యంత సన్నిహితుడైన బాబా సిద్ధిక్‌ని చంపడం ద్వారా సల్మాన్ ఖాన్‌కి సందేశం పంపింది. ఈ విషయాన్ని బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
Salman Khan: మహారాష్ట్రలోని పన్వెల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్‌లో అతడిని హత్య చేసేందుకు రూ.25 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు నవీ ముంబై పోలీసులు గురువారం దాఖలు చేసిన ఛార్జిషీట్ పేర్కొంది.
Salman Khan: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యను తామే చేశామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సల్మాన్ ఖాన్‌తో స్నేహం కారణంగానే ఇతడిని చంపేసినట్లు సోషల్ మీడియా పోస్టులో ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద భద్రతను పెంచారు. ఈ ప్రాంతం చుట్టూ భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 60 మంది…
Bishnoi community: ఎన్సీపీ నేత, మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్‌కి అత్యంత ఆప్తుడు, మిత్రుడిగా ఉన్న సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అసలు సల్మాన్ ఖాన్‌కి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు..?
హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హాస్యనటుడు మునావర్ ఫరూఖీని అంతమొందించాలని సెప్టెంబర్‌లోనే బిష్ణోయ్ గ్యాంగ్ ఫ్లాన్ చేసింది. కానీ తృటిలో అతడు తప్పించుకున్నట్లుగా తాజా విచారణలో వెల్లడైంది.
ఇదిలా ఉంటే, ఈ హత్యని తామే చేసినట్లు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ మొత్తం ఘటన బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌తో ముడిపడి ఉంది. సల్మాన్ ఖాన్‌కి ఎవరైనా సాయం చేస్తే,వారికి సిద్ధిక్ గతి పడుతుందని హెచ్చరించింది.
Salman Khan: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడు జీషాన్ సిద్ధిక్ కార్యాలయం సమీపంలో బాబా సిద్ధిక్‌ని కాల్చి చంపారు.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అమెరికాలో జరగనున్న ఓ ఈవెంట్లో సల్మాన్ పాల్గొంటున్నాడని, అందుకు సంబంధించి టికెట్స్ కొనాలనేది ఆ వార్త సారాంశం. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోను చూసేందుకు సల్మాన్ ఫ్యాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. తమకు తెలియకుండా జరిగిన ఈ ఫేక్ ప్రచారంపై సల్మాన్, ఆయన టీం స్పందించారు. ఈ విషయంలో ఆయన అభిమానులను హెచ్చరించారు. అమెరికాలో…