Baba Siddique Murder: ముంబైలో ఎన్సీపీ(అజిత్ వర్గం) నేత, మాజీ మంత్రి బాబా బాబా సిద్ధిక్ హత్యలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రమేయాన్ని ముంబై పోలీసులు నిర్ధారించారు. అయితే, గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ యొక్క కస్టడీని పొందడంలో అనేక సవాళ్లను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎదుర్కొంటున్నారు. అతని పేరు హై ప్రొఫైల్ కేసులలో వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ నివాసంలో జరిగిన కాల్పుల ఘటనలో కూడా బిష్ణోన్ ప్రమేయం ఉందనే విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ముంబై పోలీసులు పలు దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ.. సదరు గ్యాంగ్‌స్టర్‌ను అదుపులోకి తీసుకోవడంలో మాత్రం విజయం సాధించలేకపోయారు.
Read Also: Chalaki Chanti : ఆ సమయంలో నన్ను ఎవరూ ఆదుకోలేదు… ఇకపై నో జబర్దస్త్ : చలాకీ చంటి
కాగా, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ ముఠా బాధ్యత వహించడంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి అరెస్టు చేసిన షూటర్లు కూడా ముఠాకు చెందినవారేనని పేర్కొంది. అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలు నుంచి లారెన్స్ బిష్ణోయ్‌ను తరలించడాన్ని నిషేధిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం దీనికి ప్రధాన కారణం. ఆర్డర్ మొదట ఆగస్టు 2024 వరకు అమలులో ఉండగా..ఇప్పుడు పొడిగించబడినట్లు తెలిపారు.
Read Also: Salman Khan: బాబా సిద్దిఖీ హత్యతో సల్మాన్ ఖాన్కు భద్రత పెంపు..
అయితే, సరిహద్దు దాటి డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన కేసులో 2023 ఆగస్టులో లారెన్స్ బిష్ణోయ్‌ని ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి సబర్మతి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ గ్యాంగ్‌స్టర్‌పై డజన్ల కొద్దీ కేసులు ఉన్నాయి. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలాపై జరిగిన ఘోరమైన దాడికి కూడా తానే బాధ్యులని అతడు ప్రకటించాడు. బిష్ణోయ్ ఖైదు చేయబడినప్పటికి అతడి ముఠా కార్యకలాపాలను విదేశాల్లో ఉన్న ముగ్గురు వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గోదర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక, 1990లలో దావూద్ ఇబ్రహీం తన నెట్‌వర్క్‌ను చిన్న చిన్న నేరాలతో ప్రారంభించి ఎలా నిర్మించుకున్నాడో.. అదే విధంగా ఈ టెర్రర్ సిండికేట్ కూడా అలాగే విస్తరించిందని ఎన్ఐఏ వెల్లడించింది.
Read Also: Different Weather: రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం.. సతమతమవుతున్న ప్రజలు..
ఇక, లారెన్స్ బిష్ణోయ్ కమ్యూనిటీ ఆరాధించే రెండు కృష్ణజింకలను వేటాడినప్పటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నందునే బాబా సిద్ధిఖీని లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ గ్యాంగ్ ఎక్స్ లో చేసిన పోస్ట్ పేర్కొంది. అలాగే, సల్మాన్ ఖాన్ లేదా దావూద్ గ్యాంగ్‌కు ఎవరైనా సహాయం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కూడా అందులో హెచ్చరించారు. సల్మాన్ ఖాన్‌ను కొన్నేళ్లుగా బిష్ణోయ్ ముఠా లక్ష్యంగా చేసుకుని పదేపదే దాడులకు పాల్పడుతుంది.