Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్.. పాక్ నుంచి ఏకే-47..
- సల్మాన్ ఖాన్ హత్యకు అతిపెద్ద కుట్ర..
- రూ. 25 లక్షలకు కాంట్రాక్ట్.. పాక్ నుంచి ఆయుధాలు..
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఒప్పందం..
- పోలీసుల ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: మహారాష్ట్రలోని పన్వెల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్‌లో అతడిని హత్య చేసేందుకు రూ.25 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు నవీ ముంబై పోలీసులు గురువారం దాఖలు చేసిన ఛార్జిషీట్ పేర్కొంది. ఐదుగురు వ్యక్తులు, జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ముఠా ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్నట్లు వెల్లడించింది. నిందితులు పాకిస్తాన్ నుంచి అత్యాధునియ ఆయుధాలైన ఏకే-47, ఏకే-92, ఏమ్-16 వంటి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు పంజాబీ సింగర్ సిద్దూమూసేవాలాను చంపేందుకు వాడిన జిగానా అనే ఆయుధాన్ని కూడా కొనాలనుకున్నారని ఛార్జిషీట్ పేర్కొంది.
నిందితులు సల్మాన్ ఖాన్‌ని హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు అబ్బాయిలను నియమించుకున్నారని, వీరింతా పూణే, రాయ్‌గఢ్, నవీ ముంబై, థానే, గుజరాత్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలిపింది. దాదాపుగా 60-70 మంది సల్మాన్ ఖాన్ కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని బాంద్రా ఇంటిని, పన్వెల్‌లోని ఫామ్‌హౌజ్‌ని, గోరేగావ్ లోని సల్మాన్ ఖాన్‌ని ట్రాక్ చేసినట్లు ఛార్జిషీట్ పేర్కొంది. సల్మాన్‌ఖాన్‌ని చంపడానికి ఆగస్టు 2023- ఏప్రిల్ 2024 మధ్య ప్లాన్ జరిగింది.
Also Read
Read Also: Rajnikanth : “వెట్టయన్ ది హంటర్”కి ప్రీక్వెల్ చేయాలని ఉంది : టి.జె. జ్ఞానవేల్
గురువారం హర్యానాలోని పానిపట్‌లో అరెస్ట్ అయిన సుఖా, కుట్రలో పాల్గొన్న షూటర్ అజయ్ కశ్యప్ అలియాస్ ఏకేతో పాటు మరో నలుగురికి హత్యను కేటాయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సల్మాన్ ఖాన్‌కి గట్టి భద్రత, బుల్లెట్ ఫ్రూవ్ వాహనం కారణంగా హత్యకు అత్యాధునిక ఆయుధాలు అవసరమవుతాయని కశ్యప్, అతని టీం ఓ నిర్ణయానికి వచ్చింది. దీంతో సుఖా ఆయుధాల కోసం పాకిస్తాన్‌కి చెందిన ఆయుధ వ్యాపారి డోగర్‌ని సంప్రదించాడు. డోగర్ ఆయుధాలను సరఫరా చేయడానికి అంగీకరించగా, సుఖా 50 శాతం అడ్వాన్ ఇచ్చి, మిగతాది భారతదేశంలో డెలవరీ చేయడానికి అంగీకరించాడు.
షూటర్లు అంతా కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తు్న్నారని పోలీసులు కనుగొన్నారు. సల్మాన్ ఖాన్‌ని చంపేసిన తర్వాత నిందితులంతా కన్యాకుమారి వెళ్లి, అక్కడ నుంచి శ్రీలంకకు అక్కడ నుంచి భారతీయ నిఘా సంస్థలు చేరలేని దేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారని ఛార్జిషీట్ పేర్కొంది. బాంద్రాలో సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిగిన తర్వాత, పన్వెల్ ఘటన వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?