Salman Khan: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యను తామే చేశామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సల్మాన్ ఖాన్‌తో స్నేహం కారణంగానే ఇతడిని చంపేసినట్లు సోషల్ మీడియా పోస్టులో ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద భద్రతను పెంచారు. ఈ ప్రాంతం చుట్టూ భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 60 మంది పోలీసులు అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 24/7 పనిచేస్తున్నారు.
సిబ్బందితో పాటు ముంబై పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో కూడిన కూడిన AI- ఎనేబుల్డ్ హై-రిజల్యూషన్ CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు అనేక సార్లు ఇంటి చుట్టుపక్కల తిరిగిన వ్యక్తలను క్యాప్చర్ చేస్తాయి. మూడుసార్ల కంటే ఎక్కువగా క్యాప్చర్ చేయబడితే వార్నింగ్ సిగ్నల్స్ పంపుతాయి. ప్రత్యేక కమాండ్ సెంటర్ రోజంతా ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తోంది.
Read Also: Ratan Tata: రతన్ టాటాకు అంబానీ ఫ్యామిలీ.. ఉద్యోగులు ఘన నివాళి
ఏప్రిల్ నెలలో బిష్ణోయ్ గ్యాంగ్‌తో సన్నిహితంగా ఉన్న షూటర్లు సల్మాన్ ఖాన్ నివాసం వెలపల నుంచి దాడి చేశారు. భద్రత ఉన్నప్పటికీ దాడి జరగడంతో, పోలీసుల మోహరింపు పెరిగింది. గెలాక్సీ అపార్ట్‌మెంట్ చుట్టూ అనేక ప్రదేశాల్లో భద్రతా తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వ్యూహాత్మక పాయింట్ వద్ద అధికారులను నియమించారు. మహిళా అధికారులతో కూడిన 60 మంది పోలీసులు సల్మాన్ ఖాన్ ఇంటికి రక్షణగా ఉన్నారు. భవనంలోకి వెళ్లే ప్రతీ వ్యక్తిని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ వెలుపల ఎలాంటి అనధికారిక వ్యక్తులు లేదా అభిమానులు గుమిగూడేందుకు అనుమతి లేదు. సల్మాన్ ఖాన్‌కి ప్రస్తుతం వై-ప్లస్ సెక్యూరిటీ కవర్ ఉంది. దీంట్లో 8 నుంచి 10 మంది సాయుధ పోలీసులు ఉంటారు. వీరంతా సల్మాన్ ఖాన్ వెంటే ఉంటారు. ప్రతీరోజూ సల్మాన్ ఖాన్ కదలికల్ని స్థానిక పోలీస్ స్టేషన్ సమన్వయం చేస్తుంది.