Workers Strike : పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా.. తమ వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ పలు రంగాలకు చెందిన కార్మికులు బ్రిటన్ లో రోడ్డుపైకి వచ్చారు.
ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న స్పెషలిస్టు డాక్టర్లకు 30 శాతం నుంచి 50 శాతం వరకు జీతాలు పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీవీవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేసే స్పెషలిస్టు డాక్టర్లకు 50 శాతం, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (జనరల్), డీఏఎస్ లకు 30 శాతం మేర జీతాలు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.…
రాజమండ్రిలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీలు, ఆశావర్కర్ల ఆందోళనలపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ పేదల పక్షపాతి వారి ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వంపై ఈర్ష్యతో ప్రతిపక్షాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయి. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది. ఎన్నికలకు ముందు అంగన్వాడీ వర్కర్లకు ఏడు వేల రూపాయల జీతం వచ్చేది. సీఎం…
కరోనాతో గత రెండేళ్లుగా జీతాల పెంపు లేని ప్రైవేటు ఉద్యోగులకు అయాన్స్ సంస్థ సర్వే తీపికబురు చెప్పింది. 2022 ఏడాదిలో జీతాల విషయంలో దేశంలోని ప్రముఖ కంపెనీలు ఐదేళ్ళ గరిష్ఠ స్థాయిలో ఇంక్రిమెంట్లు ఇస్తాయని సర్వే వెల్లడించింది. సగటున 9.9% వేతనాల పెంపు ఉంటుందని అయాన్ సంస్థ తెలిపింది. 2021లో వేతనాల పెంపు సగటు 9.3 శాతంగా ఉందని గుర్తు చేసింది దీంతో ఈ ఏడాది ఇంక్రిమెంట్లు పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. మరోవైపు బ్రిక్స్ కూటమిలోని…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయడానికి వీల్లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కాగా ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 30 శాతం…