తెలంగాణ ప్రజలకు మరోమారు షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్దమైంది. ప్రయాణీకులపై మళ్లీ భారం మోపేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్, డీజిల్ సెస్, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ అంటూ దాదాపు 35 శాతం వరకు టీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే సామాన్యుల, విధ్యార్థులు ఈభారాన్ని మోపలేని స్థితిలో నెట్టుకొస్తున్నా అయినప్పటికీ టీఎస్ ఆర్టీసీ నష్టం వస్తుందని మరోసారి టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమమయ్యింది. సగటున 20 నుంచి 30…
ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దిక్కుతోచకుండా వున్న ప్రయాణికులపై మరో భారం మోపింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. ఒకటికాదు ఏకంగా రెండుసార్లు టికెట్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ధరలను కూడా బాగా సవరించింది. దీంతో 30 శాతం వరకూ బస్ పాస్ ఛార్జీలు పెరిగాయి. తాజాగా ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ పిడుగు వేసింది. రిజర్వేషన్ ఛార్జీలు పెంచేసింది. పెంచిన రిజర్వేషన్ ఛార్జీలపై ఇప్పటి వరకు అధికార ప్రకటన చేయలేదు ఆర్టీసీ. గుట్టుచప్పుడు కాకుండా…
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత… వినూత్న తరహాలో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని లాభాల బాట పట్టించే పనిలో పడిపోయారు సజ్జనార్.. ఇక, ఏ పండుగ వచ్చినా..? ఏ ప్రత్యేక ఉన్నా..? ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు తీసుకున్నారు.. తాజాగా మరో ఆఫర్ తీసుకొచ్చింది టీఎస్‌ఆర్టీసీ… ఉగాది పండుగ సందర్భంగా 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చింది.. Read…
సంక్రాంతి పండగ సందర్భంగా భాగ్యనగరంలోని ప్రజలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నివసించేవారు స్వగ్రామాలకు వెళ్లారు. అయితే సంక్రాంతి పండగ పూర్తి కావడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరుగుప్రయాణం అవుతున్నారు. అలాంటి వారి కోసం టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సొంత గ్రామాలకు వెళ్లిన వారి కోసం 3,500 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్…
ఐపీఎస్ అధికారి సజ్జనార్.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరి స్తున్నారు. ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది.. సొంత ఊర్లకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏపీకి చెందిన వారు.. ఊర్లకు వెళ్తారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీకి దిమ్మ తిరిగే కౌంటర్…
కోవిడ్ మహమ్మారి తరువాత విధించిన లాక్‌డౌన్ కారణంగా భారీ నష్టాలను చవిచూసిన TSRTC ఇప్పుడు ప్రజలకు మరింత చేరువ కావడం ద్వారా తన ఆదాయ వనరులను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. దాని వ్యూహంలో భాగంగా, కార్పొరేషన్ అధికారులు సోషల్ మీడియాపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు, ఇది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, వారి ప్రాంతాలలో సమస్యలను పోస్ట్ చేయడానికి పెద్ద వేదికగా ఉద్భవించింది. ప్రపంచవ్యాప్తంగా మారిన టెక్నాలజీ సాయంతో, ఆర్టీసీ అధికారులు కార్పొరేషన్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమను…
ఈరోజు ఉదయం సిరివెన్నెల పార్థివదేహన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ కు చేర్చారు. అక్కడ ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం సిరివెన్నెలకు కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో సిరివెన్నెల పార్థివదేహానికి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నివాళులు అర్పించారు. గత రెండు సంవత్సరాల నుంచి సిరివెన్నెల గారితో నాకు అనుబంధం ఉంది. సమాజాం పట్ల చాలా గౌరవం కలిగిన వ్యక్తి. నేను ఈ వారంలోనే ఆయనను కలవాలి అనుకున్నాను. కోవిడ్ సమయంలో పోలీసులు…
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినాటి నుంచి టీఎస్ ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు సజ్జనార్. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొత్త ఆలోచనలతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ పై దృష్టి పెట్టే విధంగా చేస్తున్నారు. నూతన సంస్కరణలతో ఆర్టీసీ లాభాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో కీలక విషయాన్ని సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. 48,214 మంది ఉద్యోగులతో పాటు 5,034…
టీయస్ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ… యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు.…
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.114కి చేరడంతో వాహనాలలో పెట్రోల్ పోయించాలంటే మిడిల్ క్లాస్ ప్రజల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అయితే పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నుంచి ప్రజలు ఉపశమనం పొందాలంటే ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ ఆ ట్వీట్‌లో కోరారు. అంతేకాకుండా హీరో మహేష్ బాబు…