ఐపీఎస్ అధికారి సజ్జనార్.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరి స్తున్నారు. ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది.. సొంత ఊర్లకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏపీకి చెందిన వారు.. ఊర్లకు వెళ్తారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.
సంక్రాంతి సమయంలో.. ఏపీలో ఆర్టీసీ టిక్కెట్ల ధరలను పెంచిందని.. కానీ తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఛార్జీలు పెంచలేదు. కాబట్టి ఏపీకి వెళ్లే ప్రయాణికులు అందరూ తెలంగాణ ఆర్టీసీలో టికెట్లు బుక్ చేసుకోండి..డబ్బులను ఆదా చేసుకోండి అంటూ అర్థం వచ్చేలా మహేష్ బాబు సినిమా పోస్టర్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్టర్ పూర్తిగా ఏపీఎస్ ఆర్టీసీకి వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. కాగా.. సంక్రాంతి నేపథ్యంలో… 50 శాతం చార్జీలను పెంచి ప్రయాణికుల నడ్డి విరిచింది ఏపీ ఆర్టీసీ.
Books your tickets for Sankranti vacation now and avoid the last-minute hassle. #TravelWithTSRTC
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 26, 2021
తక్కువ ధరలో బస్సు టిక్కెట్టు మరియు శుభప్రదమైన సుఖ ప్రయాణం #TSRTC లోనే
@TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @urstrulyMahesh @onlymaheshfans @baraju_SuperHit @TrackTwood pic.twitter.com/xlAphzF35l