TSRTC Sajjanar: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ అధికారులు, ఇతర ఆర్టీసీ ఉద్యోగులు టీషర్టులు, జీన్స్ ధరించి విధులకు హాజరుకావద్దని ఆదేశాలు జారీ చేశారు. కొందరు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఆర్టీసీ ఉద్యోగులు టీషర్టులు, డెనిమ్ ప్యాంట్‌లతో విధులకు వస్తున్నప్పటికీ.. ఈ తరహా దుస్తులు సంస్థను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది…
ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ మోడల్ కౌంటర్‌ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ప్రారంభించారు. కొత్త కౌంటర్‌లో ఒక పార్శిల్‌ను బుకింగ్ చేసి రశీదును వినియోగదారుడికి ఆయన అందజేశారు.…
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా TSRTC 100 బస్సులను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన బస్సులను మేడారంకు కూడా నడపనున్నుట్లు ఆయన చెప్పారు. మరోవైపు.. పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరో 1000 బస్సులు కొంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టాలని మేనిఫెస్టోలో…
హైదరాబాద్ ఎన్టీఆర్మార్గ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద TSRTC కొత్త బస్సులు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 100 కొత్త బస్సులు ప్రారంభించటం సంతోషకరం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలు…
VC Sajjanar: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. త్వరలోనే.. 2,375 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసి కండక్టర్ నిర్వాకం బయటపడింది. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో ఓ కండక్టర్ మహిళలకు టికెట్ కొట్టాడు. ఉచిత బస్సు సౌకర్యం ఉందన్న కండక్టర్ వినలేదు. ఈ క్రమంలో.. కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు బాధితులు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. వెంటనే.. కండక్టర్ ను విధుల నుంచి ఆర్.ఎం. జాని రెడ్డి తప్పించారు. బోధన్ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న…
ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేశారు. బాలికలకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ పరిధి వరకు వర్తిస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రానుంది. జిల్లాలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. సిటీలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. కాగా.. అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.…