Sajjala Ramakrishna Reddy: గడప గడపకు కార్యక్రమం అంటే ప్రజల దగ్గరకు వెళ్లడమేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మూడేళ్లలో ఆయా కుటుంబాల్లో వచ్చిన మార్పులు వివరించడం కోసమే గడప గడపకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలది పెద్ద పాత్ర అంటూ తెలిపారు. ఇది కాలేజీ కాదు అందరూ నాయకులే.. సీఎం జగన్ ఎవరి మీదో సీరియస్ అయ్యారు అని నెగెటివ్‌గా చూడాల్సిన అవసరం లేదన్నారు. చేసే పని శ్రద్ధగా చెయ్యమని సీఎం జగన్ చెప్తారన్నారు.
Vijay Diwas: విశాఖలో ఘనంగా విజయ్ దివస్.. అమరవీరులకు నివాళులు
పార్టీ అంతర్గతంగా 175 స్థానాలు గెలిచే విధంగా చెప్పే ప్రయత్నమే ఈ సమావేశమని వెల్లడించారు. గడప గడపకు పెర్ఫార్మన్స్ అనడం కంటే ప్రజల దగ్గరకు వెళ్లడమే ఎజెండా అని ఆయన చెప్పారు.గడప గడపకు కూడా ఎమ్మెల్యేల ఫైనల్ పెర్ఫార్మెన్స్‌లో ఒక భాగమన్నారు. ప్రజల్లో తిరిగితేనే గ్రాఫ్ పెరుగుతుందని.. సర్వేల్లో కూడా వస్తుందని సజ్జల స్పష్టం చేశారు.