దేశ ప్రజల ముఖాల్లో వెలుగు చూడాలని ఆ జవాన్ తాపత్రయం.. దేశ ప్రజలకు వెలుగులు పంచుతూ దీపావళి రోజే ప్రకృతి ప్రకోపానికి బలి కావడంతో ఆ కుటుంబంలో చీకట్లు అలముకున్నాయి. ఎప్పుడూ దేశ సేవ కోరేవాడని, ఆ క్రమంలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని సైనికుడిగా చేరి విధులు నిర్వహిస్తుండగానే అసువులు బాశారు ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన పెద్దావుల కార్తీక్‌కుమార్‌రెడ్డి. కార్తీక్ వయసు 29 ఏళ్ళు. గురువారం సాయంత్రం హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మనాలి సమీపంలో మంచుకొండలు…
కరోనా కాలంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇప్పటికీ ఇంకా అనేక దేశాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. డెల్టా వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియాలో ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అటు ఫ్రాన్స్‌లోనూ కరోనా ఇబ్బందులు పెట్టింది. అత్యవసరంగా ప్రయాణం చేయాలి అనుకున్నా కుదరక ఉన్నచోటనే కోట్లాది మంది ఉండిపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫోల్డ్ అనే వ్యక్తి కరోనా కారణంగా ఫ్రెంచ్…