Sachin Tendulkar 27 Runs Video Goes Viral: 2013లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆటకు వీడ్కోలు పలికి 10 సంవత్సరాలు అవుతున్నా.. ప్రస్తుతం 50 ఏళ్ల వయసున్నా.. తన బ్యాటింగ్‌లో సత్తా ఏమాత్రం తగ్గిపోలేదని నిరూపించాడు. వన్ వరల్డ్ వర్సెస్ వన్ ఫ్యామిలీ టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సచిన్ హిట్టింగ్ చేశాడు. కర్నాటకలోని ముద్దనహల్లి సాయి కృష్ణన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 16 బంతుల్లో 27…
తాజాగా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది. ఈ మేరకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు.
Deepfake video: ఇటీవల కాలంలో దేశంలో ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలో ఆందోళన కలిగిస్తు్న్నాయి. ఏఐ టెక్నాలజీ సాయంతో వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు. గతంలో రష్మికా మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ వంటి మూవీ స్టార్స్ డీప్‌ఫేక్‌కి బారినపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా క్రికెట్ స్టార్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా డీప్‌ఫేక్ బాధితుడయ్యారు. సచిన్ ఆన్‌లైన్ గేమ్‌ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వాయిస్‌తో ఓ వీడియో వైరల్ అవుతోంది. డీప్‌పేక్ టెక్నాలజీతో ఈ వీడియోను రూపొందించారు. దీనిపై…
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతేకాదు కేప్‌టౌన్‌లో తొలి టెస్టు విజయాన్ని భారత్ నమోదు చేసింది. భారత్ విజయంలో పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్స్ పడగొట్టాడు. మొత్తంగా రెండో టెస్టులో సిరాజ్ 7 వికెట్లు,…
Bharat Ratna Award : ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం అందించే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఈ అవార్డును జనవరి 2, 1954న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు.
Soumya Sarkar breaks Sachin Tendulkar’s Record: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 14 ఏళ్ల రికార్డును బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ బద్దలు కొట్టాడు. ఆసియా నుంచి వన్డేలలో న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా సౌమ్య రికార్డుల్లో నిలిచాడు. బుధవారం నెల్సన్లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సౌమ్య సర్కార్ 151 బంతుల్లో 111.92 స్ట్రైక్ రేట్‌తో 169 పరుగులు చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టడం…
Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీకి దేశవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి. ఈ రోజు న్యూజిలాండ్‌తో ముంబైలో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ క్రికెట్ హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేశారు. సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. 50వ సెంచరీ సాధించారు.
వాంఖడే మైదానంలో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కింగ్ కోహ్లీ పేరిట ఉంది. 2023 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ బ్యాట్ నుండి ఈ చారిత్రాత్మక సెంచరీ వచ్చింది.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.