Sachin Tendulkar: బైక్‌పై వెళ్తున్న అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన సచిన్.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar Meets His Fan at Road: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన అభిమానికి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న తన అభిమానిని ఫాలో అయి మరి మాట్లాడాడు. తన ఆరాధ్య క్రికెటర్‌ను చూసిన సదరు అభిమాని.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన అభిమానితో కాసేపు మాట్లాడిన సచిన్.. ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇందుకుసంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
సచిన్ టెండూల్కర్ గురువారం తన స్నేహితుడితో కలిసి కారులో వెళుతుండగా.. రోడ్డుపై ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించి ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. ఆ జెర్సీపై ‘టెండూల్కర్.. ఐ మిస్ యూ’ అని రాసి ఉండడాన్ని సచిన్ చూశాడు. దాంతో ఆ అభిమానిని కారులోనే ఫాలో అయ్యాడు. రద్దీ తక్కువ ఉన్న ప్రాంతంలో కారుని ఆపి.. విమానశ్రయానికి ఎలా వెళ్లాలని అడిగాడు. సచిన్‌ను చూసిన ఆ అభిమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆపై తేరుకుని దేవుడికి థాంక్స్ చెపుతాడు. తాను ఎంత పెద్ద ఫ్యానో సచిన్‌కు వివరిస్తాడు. తన చేతి మీద ఉన్న టాటూ, తన కుమారుడి చిత్రాలను టెండూల్కర్‌కి చూపిస్తాడు. సచిన్ ఫొటో కలెక్షన్లన కూడా చూపిస్తాడు. అభిమాని ప్రేమకు సచిన్ ఫిదా అవుతాడు. ఆపై అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చి.. హెల్మెట్ పెట్టుకుని బైక్ నడపడంను ప్రశంసిస్తాడు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Also Read: Yashasvi Jaiswal Century: ఫోర్‌తో హాఫ్ సెంచరీ.. సిక్స్‌తో సెంచరీ! యశస్వి జైస్వాల్ సూపర్ బ్యాటింగ్
తన అభిమానిని కలిసిన వీడియోను సచిన్ టెండూల్కర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘సచిన్.. టెండూల్కర్‌ని కలిశాడు. నాపై ఇంత ప్రేమ కురిపించడం చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఊహించని విధంగా వచ్చే ప్రేమే జీవితాన్ని చాలా ప్రత్యేకం చేస్తుంది’ అని సచిన్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సచిన్ భారత్ తరఫున 200 టెస్టులు, 463 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు.
Sachin meets TENDULKAR. 😋
It fills my heart with joy when I see so much love showered on me. It is the love from the people that keeps coming from unexpected corners which makes life so special. pic.twitter.com/jTaV3Rjrgm
— Sachin Tendulkar (@sachin_rt) February 1, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?