Sachin Tendulkar Batting: సచిన్ హిట్టింగ్.. 16 బంతుల్లో 27 పరుగులు! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar 27 Runs Video Goes Viral: 2013లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆటకు వీడ్కోలు పలికి 10 సంవత్సరాలు అవుతున్నా.. ప్రస్తుతం 50 ఏళ్ల వయసున్నా.. తన బ్యాటింగ్‌లో సత్తా ఏమాత్రం తగ్గిపోలేదని నిరూపించాడు. వన్ వరల్డ్ వర్సెస్ వన్ ఫ్యామిలీ టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సచిన్ హిట్టింగ్ చేశాడు. కర్నాటకలోని ముద్దనహల్లి సాయి కృష్ణన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 16 బంతుల్లో 27 పరుగులు చేశాడు. లిటిల్ మాస్టర్ తన మార్క్ షాట్లతో అలరించాడు. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ’ కప్‌లో భారత్, ఇతర దేశాలకు చెందిన దిగ్గజాలు బరిలోకి దిగారు. సచిన్ కెప్టెన్సీలోని వన్ వరల్డ్, యువరాజ్ సింగ్ నాయకత్వంలోని వన్ ఫ్యామిలీ జట్లు ఫ్రెండ్లీ మ్యాచ్. ఆడాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వన్ ఫ్యామిలీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాడు డారెన్ మ్యాడీ (51) హాఫ్ సెంచరీ చేయగా.. భారత్ ఆటగాళ్లు యూసఫ్ పఠాన్ (38), యువరాజ్ సింగ్ (23) పరుగులు రాణించారు. వన్ వరల్డ్ బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్స్ తీశాడు.
Also Read
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
Also Read: West Indies Retirements: వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్.. ఒకేసారి నలుగురు క్రికెటర్లు వీడ్కోలు!
181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వన్ వరల్డ్ 19.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. అల్విరో పీటర్సన్ (74) హాఫ్ సెంచరీ చేయగా.. సచిన్ టెండూల్కర్ (27), నమన్ ఓఝా (25), ఉపుల్ తరంగ (29) రాణించారు. యూసఫ్ పఠాన్ బౌలింగ్‌లో ఇర్ఫాన్ పఠాన్ సిక్సర్ బాది మ్యాచ్ ముగించాడు. వన్ ఫ్యామిలీ బౌలర్లలో చమింద వాస్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన డబ్బును మధుసూదన్ సాయి గ్లోబల్ మిషన్ నిరుపేదల కోసం ఉపయోగించనుంది.
Batting or bowling – why choose when you’re Sachin Tendulkar? 🤩👊🏻
The legend is back to show us how it’s done in the ‘One World One Family Cup 2024’! 💪#Cricket pic.twitter.com/tRhsIM4pzR
— Star Sports (@StarSportsIndia) January 18, 2024
తాజావార్తలు
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!