క్రికెట్ లెజండర్ సచిన్ టెండూల్కర్ (Cricket legend Sachin Tendulkar) తన భార్యతో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను (Taj Mahal) సందర్శించారు. వాలంటైన్స్ డే గడిచిన మరుసటి రోజే సచిన్ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజ్‌మహల్‌ను చూసేందుకు సచిన్ తన భార్య అంజలితో కలిసి యూపీలోని ఆగ్రాకు (Agra, Uttar Pradesh) చేరుకున్నారు. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ బందోబస్తు మధ్య తాజ్‌మహల్‌ను వీక్షించి పరితపించారు.
సచిన్ దంపతులు తాజ్‌మహల్‌ను వీక్షిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు, టూరిస్టులు చూసేందుకు ఎగబడ్డారు. మరికొందరు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. కానీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వారికి సాధ్యం కాలేదు. దీంతో వారికి నిరాశే ఎదురైంది.
#WATCH | Cricket legend Sachin Tendulkar and his family visited the Taj Mahal in Agra, Uttar Pradesh today. pic.twitter.com/D3DaTTtnAZ
— ANI (@ANI) February 15, 2024