Ayodhya: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామమందిర ప్రారంభోత్సం ఈ నెల 22న జరుగనుంది. అయితే, బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపనకు ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశ విదేశాల్లోని మహా సాధువులతో పాటు పండితులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు అందించింది. ఇక, క్రీడా రంగానికి సంబందించి.. ఇప్పటికే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రన్ మిషీన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతరులకు అయోధ్య నుంచి ఆహ్వానం పింపించారు.
Read Also: Prabhas: రెబల్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న థమన్… సంతోష్ నారాయణన్…
అయితే, తాజాగా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది. ఈ మేరకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయోధ్య రామమందిర ఆహ్వానాన్ని అందుకునేందుకు ధోని అన్ని విధాలా అర్హుడు అని అభిమానులు, నెటిజన్లు వ్యాఖ్యనిస్తున్నారు.
आज प्रदेश महामंत्री (संगठन) श्री @bjpkarmveer जी और राष्ट्रीय स्वयंसेवक संघ के सह प्रांत कार्यवाह श्री धनंजय सिंह जी ने JSCA स्टेडियम में भारतीय क्रिकेट टीम के पूर्व कप्तान, झारखंड की शान श्री महेंद्र सिंह धोनी जी को अयोध्या में हो रहे राम मंदिर प्राण प्रतिष्ठा में शामिल होने के… pic.twitter.com/LXvQXOmPZK
— BJP JHARKHAND (@BJP4Jharkhand) January 15, 2024