Sachin Tendulkar Smashes Six in Akshay Kumar Bowling: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) బుధవారం ఆరంభం అయింది. లోకల్ టాలెంట్‌ను వెలికితీయడమే ఐఎస్‌పీఎల్ లక్ష్యం. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ టీమ్స్ కొనుగోలు చేశారు. ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఐఎస్‌పీఎల్ ఆరంభ వేడుకల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. హీరోలు సూర్య, అక్షయ్ కుమార్, రామ్ చరణ్ సందడి చేశారు. చరణ్ వీరందరితో ఆర్‌ఆర్‌ఆర్ ఫేమస్ సాంగ్ ‘నాటు నాటు’కు స్టెప్పులేయించాడు.
ఆరంభ వేడుకల అనంతరం ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవెన్, అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అమిర్ హుసేన్ అనే దివ్యాంగ క్రికెటర్‌తో కలిసి సచిన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తొలి ఓవర్ వేయగా.. మూడో బంతికి సచిన్ భారీ సిక్సర్ బాదాడు. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 16 బంతుల్లోనే 30 పరుగులు చేసిన సచిన్.. హిందీ బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫారుఖీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
Also Read: Women’s Day 2024: ఉమెన్స్ డే స్పెషల్.. గిఫ్టింగ్ స్టోర్‌ను ప్రారంభించిన అమెజాన్!
ఎగ్జిబిషన్ మ్యాచ్ అనంతరం ఐఎస్‌పీఎల్ తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అమితాబ్ జట్టు మఝీ ముంబై, అక్షయ్ కుమార్ టీమ్ శ్రీనగర్ వీర్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 10 ఓవర్లలో 7 వికెట్లను 140 రన్స్ చేసింది. యోగేష్ పెంకర్ (61) హాఫ్ సెంచరీ చేశాడు. ఛేదనలో శ్రీనగర్ టీమ్ 7 వికెట్లకు 107 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది. లోకేష్ (27) టాప్ స్కోరర్.
Mr. Khiladi getting told who the 𝗥𝗘𝗔𝗟 𝗞𝗵𝗶𝗹𝗮𝗱𝗶 of Cricket is 🤩🏏#SonySportsNetwork #ispl #isplt10 #Street2Stadium #ZindagiBadalLo #SachinTendulkar | @ispl_t10 pic.twitter.com/Qz3VttzYvY
— Sony Sports Network (@SonySportsNetwk) March 6, 2024