ashok gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన ప్రత్యర్థి సచిన్ పైలట్, ఇతర పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి గెహ్లాట్ పోటీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తదుపరి సీఎంగా సచిన్ ఫైలట్ పేరు తెరపైకి రావడంతో ఆయనకు వ్యతిరేకంగా, గెహ్లాట్ కు మద్దతుగా 82మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని బెదిరించారు. ఇతరులను ఆమోదించడం కంటే రెబెల్ గానే పోరాడడం నయమన్న ఆలోచనతో ఎమ్మెల్యేలు ఉన్నట్టు పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి గెహ్లాట్ క్షమాపణలు సైతం చెప్పుకోవాల్సి వచ్చింది.
ఆదివారం మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చరిత్రలో మొదటి సారి ఏకగ్రీవ తీర్మానం ఆమోదం పొందనందుకు విచారిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు నేను విచారిస్తున్నాను. 2020లో సంరక్షకుడిగా ఉంటానని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చినట్లు రాష్ట్రం విడిచి వెళితే తమకు ఏంజరుతుందోనన్న భయం ఎమ్మెల్యేలలో ఉందన్నారు. అందుకే రాజస్థాన్ సీఎల్పీగా బాధ్యతలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. రాజస్థాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని కొందరు ఎమ్మెల్యేలు అమిత్ షా, జాఫర్ ఇస్లామ్, ధర్మేంద్ర ప్రదాన్ తో భేటీ అయ్యారు. ప్రస్తుత గెహ్లాట్ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయడం బీజేపీకి ఇష్టం లేదంటూ గెహ్లాట్ వ్యాఖ్యానించారు.
Read also: Prasanth Kishore: నేటి నుంచి ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత ఖర్గే
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మల్లికార్జున ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని.. ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలరని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గే దళిత వర్గం నుంచి వచ్చిన నేత అని.. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని గెహ్లాట్ చెప్పారు. అయితే శశిథరూర్ మంచి వ్యక్తి అని, ఆయనకు మంచి ఆలోచనలు ఉన్నాయన్నారు. కానీ ఆయన ఉన్నత వర్గానికి చెందినవారు అని పేర్కొన్నారు. అందువల్ల క్షేత్రస్థాయిలో మల్లికార్జున ఖర్గేకు మద్దతు ఉందని.. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కావాల్సిన అనుభవం కూడా ఆయనకు ఉందని వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 17న ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పోటీలో ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ఇద్దరే ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8వ తేదీ వరకు సమయం ఉంది. ఆలోగా ఎవరూ ఉపసంహరించుకోకుంటే.. 17వ తేదీన పోలింగ్ జరుగుతుంది.