నేటి నుంచి ‘రైతు మహోత్సవం’ వేడుకలు ఆరంభం కానున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏప్రిల్ 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. రైతు మహోత్సవం నేపథ్యంలో నేడు జిల్లాలో ముగ్గురు మంత్రులు, పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు. రాష్ట్ర రైతు మహోత్సవం మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరంబించనున్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ…
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు మహోత్సవం’ నిర్వహిస్తోంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహించ తలపెట్టింది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు (ఏప్రిల్ 21 నుంచి 23 వరకు) ఈ మహోత్సవం కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 150 స్టాళ్లు నెలకొల్పాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా…