కరోనా కేసులు ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్నాయి. అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కరోనా నుంచి బయటపడేందేకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనాకు మొదటి వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యా మరోసారి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు అందోళనల చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా నిత్యం 900 మందికి పైగా కరోనాతో…
సాధారణంగా అంతరిక్షంలో జరిగే సన్నివేశాలకు సంబంధించిన సన్నివేశాలను ప్రత్యేకమైన సెట్స్ వేసి లేదంటే గ్రాఫిక్స్‌లోనూ షూట్ చేస్తుంటారు. కానీ, రష్యాకు చెందిన చిత్రబృందం ఏకంగా స్పేస్‌లోనే డైరెక్ట్‌గా సినిమాను షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ది ఛాలెంజ్ అనే సినిమాలోని 40 నిమిషాల సీన్ కోసం 12 రోజులపాటు అంతరిక్షంలో షూటింగ్ చేయబోతున్నారు. మంగళవారం రోజున ఈ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ లు రష్యాలోని బైకనూర్ నుంచి సోయిజ్ ఎంఎస్ 19…
రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన సహచరుల్లో అనేకమందికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తలో భాగంగా ఆయన సెల్ష్ ఐసోలేషన్‌కు వెళ్లారు. సెర్బియా ప్రాంతంలో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఐసోలేషన్ సమయంలో పుతిన్ అక్కడే ఉన్న ప్రవాహంలో చేపలు పడుతూ, అడ్వెంచర్ డ్రైవింగ్ వంటి ప్రయాణాలు చేస్తున్నట్టు అధ్యక్షుడి అధికార నివాసం కెమ్లిన్ తెలియజేసింది. దీనికి సంబందించిన ఫొటోలను కూడా రిలీజ్ చేశారు. గతంలో కూడా పుతిన్ కొన్నిరోజులు…
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తాలిబన్లకు పాక్ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటులో ఆ దేశం కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, దోహ ఒప్పందం ప్రకారం సమీకృత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ, ఆఫ్ఘనిస్తాన్ దానికి విరుద్ధంగా తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా వంటి సీనియర్…
రష్యాలోని దిగువ సభ డ్యూమాకు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబందించిన ఫలితాలు పుతిన్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. దిగువ సభ డ్యూమాలో 450 స్థానాలు ఉండగా, అందులో దామాషా పద్దతిప్రకారం 225 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో 198 స్థానాల్లో ఇప్పటికే పుతిన్ పార్టీ యునైటెడ్ రష్యా ఆధిక్యంలో ఉన్నది. యునైటెడ్ రష్యా పార్టీ 49.8 శాతం ఓట్లను సాధించింది. కాగా, ప్రత్యర్థ పార్టీ రష్యా కమ్యునిస్ట్ కేవలం…
ఒకప్పుడు అమెరికా రష్యా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు దేశాల మధ్య పచ్ఛన్నయుద్ధం జరిగింది. అయితే, 1991 దశకంలో యూఎస్ఎస్ఆర్ విచ్చిత్తి కావడంతో రష్యా ఆర్థికంగా కుదేలయింది. దీంతో అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండు దశాబ్దాల కాలంగా ఆసియాలో చైనా ఆర్థికంగా క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా తరువాత రెండో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇప్పుడు అమెరికాను సవాల్ చేసే స్థాయికి ఎదగడంతో అమెరికా, చైనా…
రష్యాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. మాస్కోలోని స్టేట్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు.. తోటి విద్యార్థులతో పాటు లెక్చరర్లపై కాల్పులకు తెగబడ్డాడు.. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. ఇక, కాల్పులు జరుగుతోన్న సమయంలో.. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు.. పై అంతస్తు నుంచి కిందకు దూకారు.. మరికొందరు విద్యార్థులు.. అలా కూడా కొంతమంది గాయాలపాలయ్యారు.
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతూనే ఉంది.. కాస్త తగ్గుముఖం పట్టినా.. ఇంకా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తగిలింది.. క్రెమ్లిన్‌లో ఉన్న సిబ్బందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలంది.. దీంతో పుతిన్ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్టు రష్యన్ మీడియా పేర్కొంటోంది. ఇక, కోవిడ్ దెబ్బతో అంతా ఆల్‌లైన్ మయం కాగా.. ఇప్పుడు పుతిన్ కూడా వీడియో లింకుల ద్వారా ఆయన సమావేశాల్లో పాల్గొంటారని క్రెమ్లిన్…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో సేనలు పూర్తిగా తప్పుకున్నాయి. 2001 నుంచి 2021 వరకు దాదాపు 80 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్‌కు సమకూర్చింది. ఇందులో అధునాతనమైన 73 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. వీటితో పాటుగా అనేక ఆయుధాలు ఉన్నాయి. అమెరికా దళాలు బయటకు వచ్చే సమయంలో కొన్నింటని వెనక్కి తీసుకొచ్చారు. కొన్ని ఆయుధాలను అక్కడే వదిలేసి వచ్చారు. ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చిన వాటిపై అమెరికా అందోళన వ్యక్తం చేస్తున్నది. అమెరికా వదిలేసి వచ్చిన…
స్కేటింగ్ గేమ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆడాల్సిన గేమ్. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాళ్లు చేతులు విరిగిపోతాయి. చిన్నపిల్లలు, యువత ఎక్కువగా ఈ గేమ్‌ను అడుతుంటారు. అయితే, రష్యాకు చెందిన 73 ఏళ్ల ఇగోర్ అనే పెద్దమనిషి స్కేటింగ్ లో తన స్కిల్స్‌ను ప్రదర్శించి భళా అనిపించాడు. 73 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి భయం, బెరుకూ లేకుండా ఇగోర్ తన ప్రతిభను ప్రదర్శించాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నది. ప్రతిభకు…