సాధారణంగా అంతరిక్షంలో జరిగే సన్నివేశాలకు సంబంధించిన సన్నివేశాలను ప్రత్యేకమైన సెట్స్ వేసి లేదంటే గ్రాఫిక్స్‌లోనూ షూట్ చేస్తుంటారు. కానీ, రష్యాకు చెందిన చిత్రబృందం ఏకంగా స్పేస్‌లోనే డైరెక్ట్‌గా సినిమాను షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ది ఛాలెంజ్ అనే సినిమాలోని 40 నిమిషాల సీన్ కోసం 12 రోజులపాటు అంతరిక్షంలో షూటింగ్ చేయబోతున్నారు. మంగళవారం రోజున ఈ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ లు రష్యాలోని బైకనూర్ నుంచి సోయిజ్ ఎంఎస్ 19 ద్వారా బయలుదేరి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. వీరితో పాటుగా మరో వ్యోమగామి ఆంటన్ ష్కాప్లెరోవ్ కూడా బయలుదేరి వెళ్లారు. అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం పాలైన వ్యోమగామిని కాపాడేందుకు డాక్టర్ యులియా ఎలాంటి సాహసం చేసింది అనే సీన్‌ను అక్కడ షూట్ చేస్తున్నారు.
Read: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఇంద్రకీలాద్రి…