ప్రస్తుతం అఫ్గన్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. భారత్ ముందు నుంచి ఊహించినట్లుగానే అప్ఘన్ కేంద్రంగా ఇండియా వ్యతిరేక ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ పై అఫ్ఘన్లు మాటమార్చడం.. తమ మిత్రదేశంగా పాకిస్థాన్, చైనాను మాత్రమే ప్రకటించడం చూస్తుంటే ఇవన్నీ కూడా భారత్ కు రాబోయే రోజుల్లో ఇబ్బందులు కలిగించే అంశాలుగా మారబోతున్నాయి. ఉగ్రవాదంపై తొలి నుంచి పోరాడుతున్న భారత్ కు తాలిబన్లు కంట్లో నలుసుగా…
తాలిబన్లకు బగ్లాన్ ప్రావిన్స్ కొరకరాని కొయ్యగా మారింది. 2001 కి ముందు కూడా ఈ ప్రావిన్స్‌లోకి తాలిబన్లు అడుగుపెట్టకుండా అప్పటి స్థానిక దళాలు అడ్డుకున్నాయి. తీవ్రంగా పోరాటం చేశాయి. ఇప్పుడు కూడా ఈ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వకూడదని స్థానిక దళాలు నిర్ణయం తీసుకొని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు జిల్లాలను తాలిబన్ల చెర నుంచి విడిపించారు. అయితే, తాలిబన్లు కాబూల్ ఆక్రమణ తరువాత శాంతిని కోరుకుంటున్నామని, అందరినీ క్షమించివేశామని చెబుతున్నారు. అయినప్పటికీ తాలిబన్ల మాటలను అక్కడి ప్రజలెవరూ కూడా…
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక ఆక్కడ పరిస్థితులను రష్యా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. 2001 కి ముందు కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను పరిపాలించారు. అయితే, వారి అరాచక పాలన ఎంతో కాలం సాగలేదు. 2001లో ఉగ్రవాదులు అమెరికా వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై దాడులు చేసి కూల్చివేసిన తరువాత అమెరికా సైన్యం ఆఫ్ఘన్ లోకి అడుగుపెట్టి తాలిబన్లను తరిమికొట్టింది. అంతకు ముందు అంటే, 1979 ప్రాంతంలో అఫ్ఘన్‌కు రష్యా సహకారం అందించింది. ఆప్రాంతాన్ని సోవియట్ యూనియన్ తమ ఆధీనంలోకి…
కరోనా మహమ్మారి రోజుకో కొత్త వైరస్‌లో వివిధ వేరియంట్లలో భయపెడుతూనే ఉంది.. ప్రస్తుతం అమెరికా, చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది డెల్టా వేరియంట్.. అయితే, కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి తయారు చేసిన వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతాయనే దానిపై పలు వాదనలు ఉన్నాయి.. కొన్ని అధ్యయనాల్లో.. అవి ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి అనేది కూడా తేల్చాయి.. తాజాగా.. రష్యా తయారు చేసిన పై స్పుత్నిక్ వి..…
దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 50 కోట్ల వరకు వ్యాక్సిన్ అందించారు. అయితే, మొదటి డోసులు వేగంగా వేస్తున్నా సెకండ్ డోస్ కోసం ఎదురుచూసేవారి సంఖ్య అధికంగా ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, కోవీషీల్డ్, కోవాగ్జిన్‌తో పాటు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటిని రష్యానుంచి దిగుమతి చేసుకోవడంతో కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు పెను ప్రమాదం తప్పింది. రష్యాకు చెందిన వ్యోమనౌక రీసెర్చ్ మాడ్యూల్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాక ఐఎస్ఎస్ తో డాక్ చేశారు. డాక్ చేసిన కొన్ని నిమిషాల తరువాత హతాత్తుగా మాడ్యూల్‌కి చెందిన థ్రస్టర్స్ ఫైర్ అయ్యాయి. దీంతో అంతరిక్ష కేంద్రం కొంతమేర అదుపుతప్పింది. వెంటనే రంగంలోకి దిగిన నాసా శాస్త్రవేత్తలు లోపాన్ని సవరించారు. దీంతో అంతరిక్ష కేంద్రం తిరిగి యధాస్థితికి వచ్చింది. డాక్ చేసిన తరువాత కంప్యూర్స్లో అప్డేట్ కాకపోవడంతో…
ప్రపంచంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉన్నది. తగ్గినట్టే తగ్గి అనేక దేశాల్లో కరోనా తిరిగి విజృభిస్తున్నది. కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యాలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్‌ను తయారు చేసినప్పటికీ ఆ దేశంలో వ్యాక్సినేషన్ మందకోడిగా సాగుతున్నది. ఇప్పటికే ఆ దేశంలో నాలుగు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రష్యాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో పాటుగా ఇప్పుడు ఆ రష్యాలో గామా వేరింట్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.…
దశాబ్దాల పోరాటం తరువాత ఫెడరల్ క్యాస్ట్రో నేతృత్వంలో క్యూబాలో కమ్యునిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది. దశాబ్ధాలుగా ఆ పార్టీనే క్యూబాలో పరిపాలన సాగిస్తోంది. అయితే, గత కొంతకాలంగా క్యూబాలో అల్లర్లు చెలరేగుతున్నాయి. కరోనా, ఆర్ధిక కుంగుబాటు, నిరుద్యోగం తదితర అంశాలు దేశాన్ని పట్టిపీడుస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున ప్రజలు హవానాకు చేరుకొని ఉద్యమం చేస్తున్నారు. క్యూబా ప్రస్తుత అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్ కనెల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు స్వేచ్చకావాలి వెంటనే అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రజలు…
కరోనా నుంచి పూర్తిగా కోలుకోవాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఒక్కటే రక్షణ మార్గం కావడంతో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను వేగంగా అందిస్తున్నారు. కరోనా మహమ్మారికి మొదటగా వ్యాక్సిన్‌ను తయారు చేసిన దేశం రష్యా. స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్‌కు సంబందించి ట్రయల్స్‌ను బయటకు ఇవ్వకపోవడంతో అనేక దేశాలు స్పుత్నక్ వీ ని ఆమోదించలేదు. Read: షూటింగ్ ప్రారంభించిన నాగశౌర్య అటు ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా…
కరోనాకు మొదటగా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన దేశం రష్యా. స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది. వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన తరువాత వేగంగా ఆ దేశంలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, ఈ వ్యాక్సిన్‌పై అక్కడి ప్రజలు పెద్దగా అసక్తి చూపడంలేదు అన్నది వాస్తవం. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ స్పుత్నిక్ వీ ని టీకాగా గుర్తించకపోవడమే ఇందుకు కారణం. రెండు డోసుల వ్యాక్సిన్‌పై ఇప్పుడు రష్యా ఆరోగ్యశాఖ కొన్ని…