ఒకప్పుడు అమెరికా… రష్యా దేశాల మధ్య కోల్డ్ వార్ నడిచింది. రష్యా విచ్చిన్నం తరువాత అమెరికా అగ్రదేశంగా చలామణి అవుతూ వస్తున్నది. అయితే, స్పేస్ రంగంలో ఇప్పటికీ రెండు దేశాల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెలకొని ఉన్నది. రెండు దేశాలు పోటాపోటీగా ఆయుధాలను తయారు చేసుకోవడంతో పాటు, అత్యాధునిక ఆయుధాలను వివిధ దేశాలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాయి.
Read: హోండా యాక్టివాపై 117 చలానాలు… యజమాని అరెస్ట్…
రష్యా ఓ అడుగు ముందుకు వేసి ఇటీవలే సొంతంగా తయారు చేసుకున్న యాంటి శాటిలైట్ క్షిపణిని ప్రయోగించి రష్యా తన సొంత ఉపగ్రహాన్ని కూల్చివేసింది. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందని, రష్యా చేసిన పని వలన అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌పై ప్రభావం పడుతుందని, అంతరిక్షంలో ఉపగ్రహ శకలాలు పెరిగిపోతాయని అమెరికా ఆరోపణలు చేసింది.