రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం వియత్నాం అధ్యక్షుడు న్గుయెన్ జువాన్ ఫుక్‌ను కలవనున్నారు. ఆయన న్గుయెన్‌ని కలిసి సైనిక సహకారం, ఆర్థిక వ్యవస్థపై చర్చించనున్నారని రష్యా అధ్యక్ష కార్యాలయం సోమవారం వెల్లడించింది. నవంబర్ 30న వియత్నాం అధ్యక్షుడికి మాస్కో ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ చర్చల్లో ఇరువురి అధ్యక్షులు.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే వాణిజ్యం, సైనిక – శాస్త్రీయ రంగాల సాంకేతిక సహకారం, కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు – రెండు దేశాల భాగస్వామ్యంతో పాటు ప్రాంతీయ ఎజెండాలపై చర్చించనున్నారని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది.