మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. కొన్ని వింతలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి వింతల్లో ఇది కూడా ఒకటి. రష్యాలోని ఖర్కాసియా పరిధిలో మెట్కెచిక్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ ఆవుకు వింత దూడ జన్మించింది. రెండు తలలతో దూడ జన్మించింది. జన్యులోపం కారణంగా ఇలా రెండు తలలతో జన్మించినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ వింత దూడ తలభాగం ఆవుమాదిరిగా ఉన్నప్పటికీ, మిగతా శరీర భాగం పంది ఆకారంలో ఉన్నది.…
గత కొన్ని రోజులుగా హైపర్ సోనిక్ క్షిపణుల ప్రయోగాలకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. చైనా హైపర్ సోనిక్ క్షిపణిని ఆగస్టులో ప్రయోగించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ఆ దేశం రహస్యంగా ఉంచి, అక్టోబర్‌లో బహిర్గతం చేసింది. దీంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాడార్లకు అందకుండా భూమిచట్టూ ఈ క్షిపణి ప్రదక్షిణ చేసి టార్గెట్‌కు 30 కిలోమీటర్ల దూరంలో పడిండి. అయితే, రాడార్లకు అందకుండా ఈ హైపర్ సోనిక్ క్షిపణులు టార్గెట్‌ను ఛేదిస్తుంటాయి.…
కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ యావత్ ప్రపంచ మానవాళి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అందరిమీద దాడి చేస్తూనే ఉంది.. జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటూ ప్రజలను భయపెడుతోంది. ఇప్పుడు డెల్టా వేరియెంట్‌లోని ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తాజాగా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు డాక్టర్లు ప్రకటించారు. యూకేలో కొత్త వేరియంట్ కేసులు ఆగడం లేదు. ఇటు, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా వెలుగు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మొదట ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేసింది మాత్రం రష్యానే. రష్యా వ్యాక్సిన్ ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు అత్యవసర వినియోగం కింద వినియోగిస్తున్నాయి. స్పుత్నిక్ వీ బూస్టర్ డోస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, మొదటి వ్యాక్సిన్ తయారు చేసిన రష్యాలోనే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. మరణాలు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య తగ్గిపోవడంతో కేసులు మరణాలు పెరుగుతున్నాయి. ఇక ఈ…
ఇప్పుడు గుర్రాలు పెద్దగా కనిపించడంలేదు. గుర్రాలను స్వారీ చేయడానికి, రథాలు లాగడానికి, సైనికులు యుద్ధాలు చేయడానికి వినియోగించేవారు. అయితే, ఈ మోడ్రన్ యుగంలో గుర్రాను కొన్ని చోట్ల మాత్రమే వినియోగిస్తున్నారు. వేగంగా దూసుకుపోయే కార్లు, బైకులు అందుబాటులోకి వచ్చిన తరువాత గుర్రాల వినియోగం తగ్గిపోయింది. అయితే, పాత రోజుల్లో గుర్రాలను ప్రయాణాల కోసం వినియోగించేవారు. రాజుల కాలం నుంచి వీటి వినియోగం ఉన్నది. అప్పట్లో మేలుజాతి గుర్రాలను పెంచేవారు. ది గ్రేట్ కింగ్ అలెగ్జాండర్ గుర్రంపైనే ప్రపంచంలో…
రష్యాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతున్నది. ప్రతిరోజూ వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను రష్యా మొదటగా తయారు చేసినప్పటికీ, వ్యాక్సినేషన్ మిగతా దేశాలతో పోలిస్తే మందకోడిగా సాగుతున్నది. దీంతో కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. కట్టడి చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రికార్డ్ స్థాయిలో కేసులు పెరుగుతుండటంతో ఉద్యోగులను వారం రోజులపాటు పని ప్రదేశాలకు దూరంగా ఉంచితే మంచిదని ప్రభుత్వం భావించింది. అక్టోబర్ 30…
విమాన ప్రమాదంలో ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన రష్యాలో జరిగింది… ఎల్ -410 టర్బోలెట్ విమానం రష్యాలోని టాటర్‌స్థాన్‌లో ఇవాళ కుప్పకూలిపోయింది.. ప్రమాదసమయంలో విమానంలో 23 మంది ప్రయాణికులు ఉండగా.. ఉదయం 9.11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.. విమాన ప్రమాదంలో 16 మంది మరణించినట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. ఈ ఘటనలో మరో ఆరుగురు వ్యక్తులను కాపాడారు.. ఇక, రష్యా విడుదల చేసిన ప్రమాదానికి సంబంధించిన చిత్రాల ప్రకారం.. విమానం తీవ్రంగా…
కరోనా కేసులు ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్నాయి. అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కరోనా నుంచి బయటపడేందేకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనాకు మొదటి వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యా మరోసారి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు అందోళనల చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా నిత్యం 900 మందికి పైగా కరోనాతో…
సాధారణంగా అంతరిక్షంలో జరిగే సన్నివేశాలకు సంబంధించిన సన్నివేశాలను ప్రత్యేకమైన సెట్స్ వేసి లేదంటే గ్రాఫిక్స్‌లోనూ షూట్ చేస్తుంటారు. కానీ, రష్యాకు చెందిన చిత్రబృందం ఏకంగా స్పేస్‌లోనే డైరెక్ట్‌గా సినిమాను షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ది ఛాలెంజ్ అనే సినిమాలోని 40 నిమిషాల సీన్ కోసం 12 రోజులపాటు అంతరిక్షంలో షూటింగ్ చేయబోతున్నారు. మంగళవారం రోజున ఈ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ లు రష్యాలోని బైకనూర్ నుంచి సోయిజ్ ఎంఎస్ 19…