రష్యా అధినేత పుతిన్ భారత పర్యటనలో కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని మోదీ-పుతిన్ కీలక ఒప్పందాలపై చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్య, ఇంధనం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. నౌకాయానం, అనుసంధాన రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ డెలివరీపై మోదీ-పుతిన్ మధ్య చర్చలు జరిగాయి. కాగా గడిచిన మూడు దశాబ్దాలుగా భారత్-రష్యా మధ్య…
రక్షణ రంగంలో ఉత్పత్తుల తయారీలో భారత్‌ను స్వయం సమృద్ధిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీన్లో భాగంగానే సుమారు ఐదు లక్షల ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న కోర్వా ప్లాంట్‌లో ఈ ఆధునిక తుపాకులను తయారు చేయనున్నారు. 7.62 X 39mm క్యాలిబర్ కలిగిన ఏకే 203 రైఫిళ్లను.. ఇన్సాన్ రైఫిళ్ల స్థానంలో వాడనున్నారు. ఇన్సాన్ రైఫిళ్లను ఇండియాలో గత మూడు దశాబ్దాల నుంచి వాడుతున్నారు. ఏకే-203…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఇక, ఇప్పుడు సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవర పెడుతోంది.. జట్ స్పీడ్‌తో వ్యాపిస్తున్న ఈ వైరస్.. అత్యంత ప్రమాదకారి అని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించగా.. మరోవైపు.. ఒమిక్రాన్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంపై కూడా దృష్టిసారించారు శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం షురూ…
రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం వియత్నాం అధ్యక్షుడు న్గుయెన్ జువాన్ ఫుక్ను కలవనున్నారు. ఆయన న్గుయెన్ని కలిసి సైనిక సహకారం, ఆర్థిక వ్యవస్థపై చర్చించనున్నారని రష్యా అధ్యక్ష కార్యాలయం సోమవారం వెల్లడించింది. నవంబర్ 30న వియత్నాం అధ్యక్షుడికి మాస్కో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ చర్చల్లో ఇరువురి అధ్యక్షులు.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే వాణిజ్యం, సైనిక – శాస్త్రీయ రంగాల సాంకేతిక సహకారం, కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ పై తీసుకోవాల్సిన…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ లు ఆక్రమించుకున్నాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాలిబన్ ప్రభుత్వంను అధికారికంగా ఏ దేశాలు గుర్తించలేదు. తాలిబన్లకు మిత్రులుగా ఉన్న పాక్, చైనాలు కూడా అధికారికంగా గుర్తించలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో 22 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుండగా, మరో 36 శాతం మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ లు అధికారంలోకి వస్తే పాక్ ప్రాభల్యం పెరుగుతుందని, ఇది పోరుగునున్న భారత్‌కు ఇబ్బందికరమని, ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులకు,…
ఈ విశాలమైన విశ్వంలో భూమి ఒక్కటే కాదు… విశ్వంలో అనేక గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, గ్రహశకలాలు ఉన్నాయి. అవి విశ్వంలో ప్రయాణం చేసే సమయంలో ఒక్కోసారి భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుంటాయి. ఒక్కోమారు కొన్ని గ్రహశకలాలు భూమిని ఢీకొడుతుంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆస్టరాయిడ్స్ భూమిని ఢీకొనడం వలన భూమిపై రాక్షసబల్లులు అంతరించిపోయాయి. అయితే, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నది. అలాంటి ప్రమాదాలు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే, 2013,…
ఒకప్పుడు అమెరికా… రష్యా దేశాల మధ్య కోల్డ్ వార్ నడిచింది. రష్యా విచ్చిన్నం తరువాత అమెరికా అగ్రదేశంగా చలామణి అవుతూ వస్తున్నది. అయితే, స్పేస్ రంగంలో ఇప్పటికీ రెండు దేశాల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెలకొని ఉన్నది. రెండు దేశాలు పోటాపోటీగా ఆయుధాలను తయారు చేసుకోవడంతో పాటు, అత్యాధునిక ఆయుధాలను వివిధ దేశాలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాయి. Read: హోండా యాక్టివాపై 117 చలానాలు… యజమాని అరెస్ట్… రష్యా ఓ అడుగు ముందుకు వేసి…
ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకూడదని ఎనిమిది దేశాలు ఆమోదించిన ఉమ్మడి ప్రకటనను అజిత్ ధోవల్ బుధవారం విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్పై మూడవ ప్రాంతీయ భద్రతా సంభాషణలో భాగంగా 7 దేశాల NSAలు ప్రకటనను ఆమోదించాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ ప్రాతినిథ్యం వహించిన సెక్యూరిటీ ఆన్ ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేషన్ లో ఇరాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్‌లు పాల్గొన్నాయి. చర్చల్లో చేరాల్సిందిగా చైనా, పాకిస్థాన్‌లను…
రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బెలారస్ దేశానికి చెందిన కార్గో విమానం కూలిపోయిన ఘటనలో ఏడుగురు స్పాట్ డెడ్ అయినట్లు అధికారులు ప్రకటించారు. రష్యాలోని తూర్పు సెర్బియాలో ఎఏన్-12 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. Read Also: తాలిబన్లు మరో సంచలన నిర్ణయం: అమెరికాను దెబ్బకొట్టేందుకు… ఈ ఘటనకు ప్రతికూల వాతావరణమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని…
రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. మరణాల రేటు కూడా పెరిగింది. దాంతో అలర్ట్ అయిన రష్యా ప్రభుత్వం… కఠిన ఆంక్షలు విధించింది. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న మాస్కో సహా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దాంతో స్కూళ్లు మూతపడ్డాయి. అత్యవసర, నిత్యవసరాలకు మినహాయింపు ఇచ్చారు. అయితే, పాక్షిక లాక్డౌన్ కూడా పూర్తిగా అమలు కావడం లేదు. మెట్రోలాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపై ఎలాంటి ఆంక్షలు లేవు. దాంతో…