రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టడంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అమెరికాతో పాటు యూరప్ దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధభయంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. సోమవారం రోజున సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17 వేల పాయింట్ల నుంచి 16900కి చేరింది. మార్కెట్లు అనుకూలంగా లేకపోవడంతో అన్నిరంగాల్లో షేర్ల అమ్మకాలు…
ఉక్రెయిన్‌లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. రష్యాకు సమీపంలో ఉన్న బెలారస్లో రష్యా సైన్యాన్ని భారీగా మోహరిస్తున్నది. మరోవైపు రష్యా సముద్రజలాల్లో లైవ్ వార్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నది. రష్యా, అమెరికా మధ్య అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. పుతిన్, జో బైడెన్లు అనేకమార్లు టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని జో బైడెన్ పుతిన్‌కు చెప్పినట్టు సమాచారం. Read: Medaram Jathara: సమ్మక్క సారక్క జాతర గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి… తాము…
రష్యా- ఉక్రెయిన్ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారేలా కనిపిస్తున్నది. ఇప్పటికే నాటో, అమెరికా బలగాలు పెద్ద ఎత్తున మొహరిస్తున్నాయి. నాటో దళాలకు అండగా ఉండేందుకు మాత్రమే తమ దళాలను పంపుతున్నట్లు అమెరికా చెబుతున్నది. ఫిబ్రవరి 16 వ తేదీన ఉక్రెయిన్ పై దాడికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తున్నదని అమెరికా వాదిస్తున్నది. రష్యా దాడులకు సంబంధించి తమ దగ్గర పక్కాసమారం ఉందని అమెరికా చెబుతున్నది. రష్యా తన జలాల్లో లైవ్ వార్ ట్రయల్స్ నిర్వహణ దానికోసమేనని చెబుతున్నది.…
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలు పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించింది. లైవ్ వార్ డ్రిల్స్‌ను చేస్తున్నది. అమెరికా సైతం ఇప్పటికే 1700 మంది సైన్యాన్ని పోలెండ్‌కు పంపింది. జర్మనీలో ఉన్న మరో వెయ్యిమంది సైన్యం పోలెండ్‌కు పయనయ్యారు. దీంతో పాటు, మరో 3 వేల మంది సైన్యాన్ని పోలెండ్ పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తున్నది. అయితే, అనుకోని విధంగా ఏదైనా యుద్ధం సంభవిస్తే రష్యాతో నేరుగా తలపడకుండా నాటో…
ఉక్రెయిన్ రష్యా మధ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఉక్రెయిన్‌కు అండగా ఉండేందుకు నాటో, అమెరికా దేశాలు సైన్యాన్ని పంపుతుండగా, రష్యా సైతం పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నది. అయితే, రష్యాను ధీటుగా ఎదుర్కొంటామని చెబుతున్న అమెరికా అవసరమైతే మరికొంత సైన్యాన్ని కూడా తరలిస్తామని చెబుతున్నది. అటు నాటో దేశాలు కూడా సైన్యాన్ని మోహరిస్తున్నాయి. రష్యా సైనిక చర్యకు దిగితే ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన కొన్ని గంటల్లోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రపంచంలో…
బోర్ కొడితే సినిమాలు చూడాలి లేదంటే పక్కన ఉన్నవాళ్లతో మాట్లాడాలి. అంతేగాని, బోర్ కొట్టిందని దొరికిన వాటిపై పిచ్చిగీతలు గీస్తే వారి రాత మారిపోతుంది. ఆ రాతను తిరిగి మార్చుకోవాలి అంటే లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తుంది. రష్యాలోని 1930 కాలంనాటి అరుదైన మూడు ముఖాలు లేని చిత్రాలు చాలా ఫేమస్. త్రీ ఫిగర్స్‌గా పేరుపొందిన ఈ మూడు చిత్రాలను యోల్ట్సిన్ లోని ది వరల్డ్ యాజ్ నాన్ ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఏ న్యూ…
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సమస్య రోజురోజుకు జఠిలం అవుతున్నది. క్రియాను రష్యా అక్రమించుకున్నాక ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా భారీ ఎత్తున సైన్యాన్ని ఆయుధాలను మోహరించింది. అయితే, ఉక్రెయిన్‌కు సపోర్ట్‌గా నాటో దళాలు రంగంలోకి దిగాయి. నాటో దళాలు రంగంలోకి దిగడంపై రష్యా స్పందించింది. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని, నాటో దళాలతో పోలిస్తే రష్యా సైన్యం తక్కువే అని, కానీ, అణ్వాయుధవ్యవస్థ బలంగా ఉన్న దేశం రష్యా అని అధ్యక్షుడు…
ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలను మోహరించగా, ఉక్రెయిన్‌కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు మోహరించాయి. ఉక్రెయిన్ ను అక్రమించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. అయితే, రష్యాకూడా ఇదే విధంగా చెబున్నది. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, సోవియట్ యూనియన్ ఒప్పందాలకు విరుద్దంగా నాటో దేశాలు, అమెరికా ప్రవర్తిస్తే తగిన చర్యలు…