Vladimir Putin Says West Wants To "Tear Apart" Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి 10 నెలలు పూర్తయ్యాయి. అయినా ఇప్పడప్పుడే యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వెస్ట్రన్ దేశాలు రష్యాను విచ్ఛిన్నం చేయడాని ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని సమర్థించారు పుతిన్. ఇది రష్యన్లను ఏకం చేయడానికే అని అన్నారు. ఉక్రెయిన్లు కూడా రష్యన్లే అని ఆయన అన్నారు.
India to receive 3rd squadron of S-400 air defence missile system: ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్నా, ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా.. భారత్, రష్యాల మధ్య బంధం బలంగానే ఉంది. స్వాతంత్య్రం అనంతరం నుంచి భారత రక్షణ రంగ వ్యవస్థ ఎక్కువగా రష్యా మీదే ఆధారపడుతోంది. చాలా సందర్భాల్లో వెస్ట్రన్ దేశాలు భారత్ కు మద్దతు తెలపకున్నా.. రష్యా అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే భారత రక్షణ కోసం అత్యంత శక్తివంతమైన…
రష్యాలోని ఓ వృద్ధుల గృహంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సైబీరియాలోని కెమెరోవో నగరంలో వృద్ధుల గృహంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించి 20 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
Russia accuses USA of being at an indirect war: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపిస్తోంది. జెలన్స్కీ పర్యటనతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇక చర్చల అంశం ప్రస్తావనకు రానే రాదని రష్యా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన యుద్ధం 10 నెలలుగా సాగుతోంది. అయితే తొలిసారి ఉక్రెయిన్…
Russia's Zircon Hypersonic Missile: ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. మరోవైపు తన దేశం సర్వనాశనం అవుతున్నా..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ యుద్ధాన్ని ఆపి, రష్యాతో చర్చలకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు. మరన్ని ఆయుధాలు కావాలంటూ అమెరికా పర్యటనకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యా అమ్ముల పొదిలో అధునాతన క్షిపణి చేరినట్లు వెల్లడించారు. దీనికి ప్రపంచంలో సాటి…
Russia Says No Chance Of Peace Talks As Zelenskiy Travels To Washington: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ బుధవారం అమెరికాలో పర్యటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ కావడంతో పాటు కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే జెలన్ స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్రంగా స్పందించింది. బుధవారం జెలన్ స్కీ వాషింగ్టన్ పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. ఉక్రెయిన్…
Russia Says Shot Down 4 US-Made Missiles, 1st Such Claim Since Ukraine War: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. రష్యా ఏకపక్షంగా యుద్ధాన్ని ముగించేలా కనిపించడం లేదు. ఇక ఉక్రెయిన్ కూడా వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంలో రష్యాతో పోరాడుతోంది. అయితే యుద్ధం వల్ల ఉక్రెయిన్ దేశం సర్వనాశనం అవుతోంది. రష్యా, అమెరికాల వివాదం మధ్య ఉక్రెయిన్ యుద్ధ భూమిగా మారుతోందని పలువురు విమర్శిస్తున్నారు.…
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతింటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయిన ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లోని చాలా భాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాజధాని కీవ్ తో పాటు రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ సర్వనాశనం అవుతున్నాయి. దీంతో పాటు మరియోపోల్, సుమీ, ఎల్వీవ్ నగరాలు రష్యా క్షిపణి దాడుల్లో దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం రష్యా 70కి పైగా మిస్సైళ్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది.
FIFA Rejects Ukrainian President Zelensky's Peace Message: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచులు జరగుతున్నాయి. ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును తన శాంతి సందేశం కోసం వేదిక చేసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్స్కీ భావించాడు. అయితే ఇందుకు ఫిఫా నిర్వాహకుల నో చెప్పినట్లు తెలిసింది. ఫైనల్ మ్యాచుకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించాలని జెలన్స్కీ…
Russian Strikes Across Ukraine: ఉక్రెయిన్ పై భారీస్థాయిలో క్షిపణులతో విరుచుకుపడుతోంది రష్యా. రాజధాని కీవ్ తో సహా దక్షిణాన ఉన్న క్రైవీ రిహ్, ఈశాన్యంలో ఉన్న ఖార్కీవ్ నగరాలపై దాడులు చేస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించింది రష్యా. ముఖ్యంగా ఈ నగరాల్లోని మౌళిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. రష్యా దాడుల వల్ల ఖార్కీవ్ నగరంలో విద్యుత్ లేకుండా పోయింది. ఖార్కీవ్ లోొ మూడు దాడులు మౌళిక సదుపాయలే…