Russian opposition leader’s comments on Putin’s murder: రష్యా ప్రతిపక్ష నేత ఇలియా పోనోమరేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన నెక్ట్స్ బర్త్ డే జరుపుకోడని..అతని అంతర్గత వ్యక్తులే అధ్యక్షుడిని చంపుతారని అన్నారు. హేగ్( అంతర్జాతీయ కోర్టు)లో పుతిన్ ను చూడటం తన వ్యక్తిగత కలళ అని దేశం నుంచి బహిష్కరించబడిని ప్రతిపక్ష నేత ఇలియా పోనోమరేవ్ అన్నారు. అయితే ఇది నెరవేరుతుందని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: Bengaluru and Hyderabad: నాణేనికి ఒక వైపు మెరుపు. మరో వైపు.. మరక
వచ్చే ఏడాది అక్టోబర్ 7న పుతిన్ కు 71 ఏళ్లు వస్తాయి. అంతకుముందే క్రెమ్లిన్ అంతర్గత వ్యక్తులు ఆయన్ను చంపుతారని పోనోమరేవ్ అన్నారు. పుతిన్ ప్రభావం తగ్గిపోతుందని.. 2022 నుంచే అతని అధికారం క్షీణించడం ప్రారంభం అయిందని అన్నారు. అయితే పుతిన్ ను హేగ్ లో చూడాలని ఉందని అయితే అతని చుట్టూ ఉన్నవారు పుతిన్ ను హేగ్ కు రానీయకుండా అడ్డుకుంటారని.. ఎందుకంటే అతడి సాక్ష్యం నిజానికి వారికి చాలా హానికరం కావచ్చు.. అందుకే వారే అతడిని చంపుతారని అన్నారు. రష్యా పూర్తిగా నియంత్రించలేని ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకున్నట్లు పుతిన్ ప్రకటించడం, ఉక్రెయిన్ తో యుద్ధం విఫల చర్యగా అభివర్ణించారు. ఖేర్సన్, ఖార్కివ్ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణతో రష్యాకు ఎదురుదెబ్బలు తగిలాయని అన్నారు.
రష్యా ప్రతిపక్ష నాయకుడు ఇలియా పోనోమరేవ్ దేశం నుంచి బహష్కరించబడ్డాడు. 2014లో క్రిమియా విలీనానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎకైక రష్యన్ పార్లమెంట్ సభ్యుడు ఇతనే. 2007 నుంచి 2016 వరకు రష్యా డూమా సభ్యుడిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ లో నివసిస్తున్నాడు. ఉక్రెయిన్ పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు. మరోవైపు పుతిన్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. పుతిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని.. కొన్ని రోజుల్లోనే మరణిస్తాడని వెస్ట్రన్ మీడియా కథనాలను కూడా ప్రచురించింది.