Putin: 2030 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2024 ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఆయన 2030 వరకు అధికారంలో ఉండేందుకు మార్గం సుగమం అవుతుందని ది టెలిగ్రాఫ్ ఒక నివేదికలో పేర్కొంది. 1999లో బోరిస్ యెల్ట్సిన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పుతిన్ అప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాకు అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.
రష్యాలో మార్చి 2024లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ నెలలో క్రెమ్లిన్ ప్రతినిధి డెమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. పుతిన్ పోటీ చేయాలనుకుంటే, మరెవరు కూడా అతనిపై పోటీ చేయలేరని అన్నారు. రష్యా రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన అధ్యక్షుడు 6 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు. దీంతో 2024లో పుతిన్ మళ్లీ ఎన్నికైతే 2030 వరకు అత్యున్నత పదవిలో కొనసాగుతారు. 2021లో రష్యా ప్రజలు కేవలం రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ పడేలా చట్టంపై పుతిన్ సంతకం చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం పుతిన్ మరో రెండుసార్లు పోటీ చేసే అవకాశం ఏర్పడింది.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Read Also: Minister KTR Exclusive Interview: ఎన్టీవీ లైవ్‌లో మంత్రి కేటీఆర్..
ప్రస్తుతం 71 ఏళ్ల పుతిన్ మరోసారి అధ్యక్షుడు కావాలని చాలా మంది రష్యన్ నేతలు కోరుకుంటున్నారు. 80 శాతం మద్దతు ఆయనకే ఉంది. అయితే పుతిన్‌కి పోటీ ఇచ్చే వారు ప్రస్తుతం రష్యాలో లేరు. ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పుతిన్ ఎన్నిక లాంఛనమే అవుతుంది.
గతేడాది ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఈ సమయంలో పుతిన్ మరోసారి అధ్యక్షుడిగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా వెస్ట్రన్ దేశాలు అనేక ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ పుతిన్ ఎక్కడా తగ్గడం లేదు. ఉక్రెయిన్ లో యుద్ద నేరాలకు పాల్పడుతున్నాడని చెబుతూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కారణంగా పుతిన్ ఎక్కువగా ఇతర దేశాలకు వెళ్లడం లేదు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా పుతిన్ కిర్గిజ్‌స్తాన్, చైనా పర్యటనకు వెళ్లారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..