Russia: ఈ వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాను సందర్శించాడు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షులు కీలక విషయాలను చర్చిన్చుకున్నట్లు గురువారం రష్యా వెల్లడించింది. చైనాతో మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికాలో తన విధానాన్ని సమన్వయం చేస్తున్నట్లు రష్యా గురువారం తెలిపింది. కాగా రష్యా ఉప విదేశాంగ మంత్రి మిఖాయిల్ బొగ్డనోవ్ మధ్యప్రాచ్యంలో చైనా ప్రత్యేక రాయబారి జై జున్‌తో దోహాలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ మరియు గాజా స్ట్రిప్‌ను నడుపుతున్న పాలస్తీనా హమాస్ గ్రూపు మధ్య వివాదంపై వారు చర్చించుకున్నారు. మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా ప్రాంతం లోని రాజకీయ సమస్యల పరిష్కారం, అలానే ఇతర సంక్షోభాలను పరిష్కరించి అక్కడ ప్రజలకు ప్రయోజనాలను సమకూర్చడం కోసం మాస్కో మరియు బీజింగ్ ప్రయత్నాల సన్నిహిత సమన్వయంపై నిరంతరం దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.
Read also:Israeli–Palestinian Conflict: ఇజ్రాయిల్-పాలస్తీనా వార్.. పుతిన్ పై మండిపడ్డ జో బైడెన్
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య సఖ్యత సమకూర్చేందుకు రష్యా తనను తాను మధ్యవర్తిగా భావిస్తుంది. కాగా అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ పైన చేసిన దాడుల్లో 1,400 మంది పైగా మరణించారు. అలానే ఇజ్రాయిల్ గాజా పై చేసిన ప్రతిస్పందన దాడిలో 3500 మంది మరణించగా 1200 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలు రష్యాని కలిచివేశాయని.. ఇరు దేశాల మధ్య సఖ్యత కుదిరించి యుద్ధం ఆపేవిధంగా మధ్యవర్తిత్వం వహించేలా రష్యాని ప్రేరేపించాయని రష్యా వెల్లడించింది.