Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధం ముగింపుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో, చర్చలకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ కూడా ప్రకటించింది.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు. పోప్ అంత్యక్రియల్లో ట్రంప్, జెలెన్ స్కీ పాల్గొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెయింట్ పీటర్స్ బసిలికాలో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. 15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశాన్ని వైట్ హౌస్ ఫలవంతమైన చర్చలుగా అభివర్ణించింది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు, ట్రంప్, జెలెన్ స్కీ సమావేశమైన ఫొటోలు వైరల్ గా మారాయి. Also Read:Iran:…
Putin: ఉక్రెయిన్‌లో ఏకపక్షంగా ఈస్టర్ కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది. ఆదివారం వరకు శత్రుత్వాన్ని ముగించాలని రష్యన్ బలగాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. శనివారం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఈస్టర్ సంధిని పుతిన్ ప్రకటించారు.
Zelensky: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తమ దేశానికి రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానించారు. మూడేళ్లుగా సాగుతున్న రష్యా దాడుల వల్ల కలిగిన విధ్వంసాన్ని చూడాలని కోరారు. ‘‘దయచేసి, ఏ విధమైన నిర్ణయాలు, ఏ రకమైన చర్చలు జరపడానికి ముందు, ఉక్రెయిన్‌లో ప్రజలు, ఆస్పత్రులు, చర్చిలు, పిల్లలు ఎలా నాశనం చేయబడ్డారో, చనిపోయారో చూడటానికి రండి’’ అని ఆదివారం జెలెన్స్కీ, ట్రంప్‌ని కోరారు.
Ukraine War: ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఫార్మాసూటికల్ కంపెనీ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ విసయాన్ని భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. రష్యా "ఉద్దేశపూర్వకంగా" ఉక్రెయిన్‌లోని భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది.
Putin: గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటనలో ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ కోసం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు రెండో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఇరు దేశాల దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందల భవనాలు నెలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు విజ్ఞప్తి చేశాడు. వేలాది మంది ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలను కాపాడాలని ట్రంప్ పుతిన్‌కు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ దళాలు పూర్తిగా చుట్టుముట్టబడ్డాయని ట్రంప్ తెలిపాడు. యుద్ధంతో ఉక్రెయిన్ చితికి పోయిందని కనికరం చూపాలని ట్రంప్…
Donald Trump: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో వైట్ హౌజ్‌లో వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కుదిరే వరకు రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు, సుంకాలను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. Read Also: Pakistan: పాకిస్తాన్‌లోని ఈ నగరంలో 80 శాతానికి పైగా హిందువులు.. గోవధపై నిషేధం, ప్రతీ…
Zelenskyy: వైట్ హౌజ్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీ మధ్య వాగ్వాదం ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఒకరిపై ఒకరు బిగ్గరగా మాట్లాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పరిణామాలతో సమావేశంలో పాల్గొన్న దౌత్యవేత్తలతో సహా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు షాక్‌కి గురయ్యారు. జెలెన్స్కీ అమెరికాని అగౌరపరిచారంటూ, యుద్ధం ఆగడం అతడికి ఇష్టం లేదని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, అమెరికా ఒక హంతకుడు(పుతిన్)కి మద్దతుగా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైట్‌హౌజ్‌లోని ఓవర్ ఆఫీస్ వేదికగా జరిగిన ఇరువురు నేతల భేటీలో వాగ్వాదం, అంతర్జాతీయ మీడియా ముందే జరిగింది. ఇద్దరు నేతలు ఒకరి మాటలకు మరొకరు అరుచుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉక్రెయిన్, అమెరికా మధ్య కీలకంగా భావిస్తున్న ‘‘ఖనిజ ఒప్పందం’’ జరగకుండానే జెలెన్స్కీ వెనుదిరిగారు. ఖనిజ ఒప్పందంతో పాటు రష్యా నుంచి తమ రక్షణకు మద్దతు ఇవ్వాలని ఉక్రెయిన్…