పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు. పోప్ అంత్యక్రియల్లో ట్రంప్, జెలెన్ స్కీ పాల్గొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెయింట్ పీటర్స్ బసిలికాలో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. 15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశాన్ని వైట్ హౌస్ ఫలవంతమైన చర్చలుగా అభివర్ణించింది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు, ట్రంప్, జెలెన్ స్కీ సమావేశమైన ఫొటోలు వైరల్ గా మారాయి.
Also Read:Iran: ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు..500 మందికి గాయాలు..
ట్రంప్, జెలెన్ స్కీ.. కీలక భేటీలో యుద్ధం ముగింపు, ఖనిజాల ఒప్పందం వంటి అంశాలపై వీరు చర్చించినినట్లు అధ్యక్ష కార్యాలయాలు వెల్లడించాయి.అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ సంఘటన అనంతరం వీరిద్దరు కలుసుకోవడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ యుద్ధంపై వారంలోపే ఓ ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read:AP Liquor Scam: సజ్జల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
పోప్ అంత్యక్రియల కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కన కాకుండా వేర్వేరు చోట్ల కూర్చోవడంతో, వారి మధ్య ఇంకా మనస్పర్థలు ఉన్నాయన్న ఊహాగానాలకు వెలువడ్డాయి. వీటిపై వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ స్పందిస్తూ, కార్యక్రమానికి హాజరైన దేశాల ప్రతినిధులకు ఫ్రెంచ్ అక్షర క్రమంలో సీటింగ్ ఏర్పాటు చేశారని, అంతకు మించి మరే ఇతర కారణం లేదని క్లారిటీ ఇచ్చారు.