యూపీలో విషాదం చోటు చేసుకుంది. ఫరూఖాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నీళ్లు తాగేందుకు వెళ్లిన విద్యార్థి.. ట్యాప్ విప్పగానే ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. చిన్నారి నేలపై పడి ఉండడం గమనించిన పాఠశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు చిన్నారిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
భారతీయ రైల్వే త్వరలో 20 కోచ్‌ల వందే భారత్ రైలును తీసుకురానుంది. ఈ రైలు ఢిల్లీ నుంచి కొన్ని నిర్దిష్ట మార్గాల్లో నడువనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న రద్దీ, పండుగల దృష్ట్యా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారత్లో క్రేజ్ పెరుగుతుండడం గమనార్హం.
కన్నబిడ్డలకు ఏదైనా జరిగితే గుండె తల్లిడిల్లిపోతుంది. అలాంటిది అభం.. శుభం తెలియని.. ఓ చిన్నారిని పొట్టనపెట్టుకున్నాడు కన్నతండ్రి. ఆరేళ్ల వయసులో కొడుకు లావుగా ఉన్నాడని ఏకంగా జిమ్‌కు తీసుకెళ్లి విపరీతంగా వ్యాయామం చేయించాడు.
సార్వత్రిక ఎన్నికల వేళ బుల్లెట్ ట్రైన్‌పై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త కబురు చెప్పారు. మరో రెండేళ్లలో ఇండియాలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టబోతుందని వెల్లడించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వర్షాకాల పార్లమెంటు సమావేశాల అనంతరం వివిధ రాష్ట్రాల పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లో పర్యటను ముగించుకున్న రాహుల్ గాంధీ.. శుక్రవారం జమ్ము కాశ్మీర్ లడఖ్‌లో పర్యటించారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో జెండర్ ఫర్ ఈక్వాలిటీ రన్ నిర్వహించారు. ఈ రన్ లో వందలాది మంది యువతులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా హాజరయ్యారు నగర సీపీ సీవీఆనంద్, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్. పాల్గొన్న పలువురు ఐపీఎస్ లు. సిటీలో 80 మంది మహిళాఎస్ఐలు పోలీసులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా మొదటి మహిళా…