సార్వత్రిక ఎన్నికల వేళ బుల్లెట్ ట్రైన్‌పై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త కబురు చెప్పారు. మరో రెండేళ్లలో ఇండియాలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టబోతుందని వెల్లడించారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అహ్మదాబాద్-ముంబై మార్గంలో బుల్లెట్ రైళ్ల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మొదటి విభాగాన్ని 2026లో ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Jogi Ramesh: రాష్ట్ర ప్రజలందరూ జగనన్న వైపే ఉన్నారు.. సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయి
భారత్‌లో ప్రారంభం కాబోయే బుల్లెట్ రైలు కోసం వివిధ స్టేషన్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. తొలి దిశను రెండేళ్ల ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అహ్మదాబాద్-ముంబై మార్గంలో పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే 290 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తయ్యాయన్నారు. ఎనిమిది నదులపై వంతెనలు నిర్మించినట్లు చెప్పారు. 12 స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయని… స్టేషన్లు కూడా బుల్లెట్ ట్రైన్‌కు తగినట్టుగానే నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు దాదాపు చివరి దిశకు వస్తున్నాయని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రధాని మోడీ ‘చొరబాటుదారుల’ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ఫిర్యాదుతో ఈసీ పరిశీలన..
బుల్లెట్ రైలు చాలా క్లిష్టమైన ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పనులు 2017లో ప్రారంభమయ్యాయన్నారు. డిజైన్‌ను పూర్తి చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టిందని తెలిపారు. ట్రైన్ వేగం చాలా బలంగా ఉంటుంది కాబట్టి అందుకు తగినట్టుగా డిజైన్ రూపకల్పన చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రతిదీ చాలా జాగ్రత్తగా పరిశీలించి.. పనులు పనులకు శ్రీకారం చుట్టినట్లుగా వివరించారు. కోవిడ్ కారణంగా కొంత ఎదురుదెబ్బ తగలిందని.. అందుకే పనుల విషయంలో కొంత జాప్యం జరిగినట్లుగా తెలిపారు. ఇక మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి నిరాకరించిందని.. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయిందని ఆరోపించారు. కానీ ఇప్పుడు మాత్రం పనులు చాలా బాగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
బుల్లెట్ రైలు కారిడార్‌లో 21 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉందన్నారు. ఇందులో 7 కిలోమీటర్ల సముద్రగర్భం ఉంటుందని.. సొరంగం యొక్క లోతైన స్థానం 56 మీటర్లు అని తెలిపారు. సొరంగం లోపల బుల్లెట్ రైళ్లు గంటకు 300-320 కి.మీ వేగంతో నడుస్తాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Nani : నరేష్ ను నేనే వాటికి కాస్త బ్రేక్ ఇవ్వమని చెప్పా..