కన్నబిడ్డలకు ఏదైనా జరిగితే గుండె తల్లిడిల్లిపోతుంది. అలాంటిది అభం.. శుభం తెలియని.. ఓ చిన్నారిని పొట్టనపెట్టుకున్నాడు కన్నతండ్రి. ఆరేళ్ల వయసులో కొడుకు లావుగా ఉన్నాడని ఏకంగా జిమ్‌కు తీసుకెళ్లి విపరీతంగా వ్యాయామం చేయించాడు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తించాడు. పరిగెత్తలేక కిందపడిపోతున్నా.. తిరిగి లేపి మరీ స్పీడ్‌గా పరుగెత్తించాడు. అంతే ఆ పసిగుండె ఒత్తిడి తట్టుకోలేక తుదిశ్వాస విడిచాడు. ఈ దారుణ ఘటన 2021, మార్చిలో అట్లాంటిక్ హైట్స్ క్లబ్ హౌస్ ఫిటినెస్ సెంటర్‌లో జరిగింది. తాజాగా జరిగిన కోర్టు విచారణలో ఇందుకు సంబంధించిన వీడియోను కోర్టులో ప్రదర్శించారు.
ఇది కూడా చదవండి: Rajasthan : పెళ్లి ఇంట్లో విషాదం.. ఏసీ పేలి తాత సజీవదహనం
ఆరేళ్ల బాలుడ్నితన తండ్రి క్రిష్టోపర్ గ్రెగర్ .. ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తమని బలవంతం చేశాడు. పరిగెత్తలేక చాలా సార్లు కిందపడిపోయాడు. అయినా కూడా తీవ్ర ఒత్తిడి చేసి పరుగెత్తించాడు. దీంతో ఆ పసి గుండె తీవ్రమైన గుండెపోటు, కాలేయం దెబ్బతినడంతో ప్రాణాలు వదిలాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు చెందిన కేసును న్యూజెర్సీ ఓషన్ సిటీలోని సుపీరియల్ కోర్టులో వీడియో ప్లే చేశారు. విపరీతమైన ఒత్తిడి కారణంగానే చిన్నారి చనిపోయినట్లుగా తేలింది. ఈ వీడియోను చూసిన కన్నతల్లి కోర్టులో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఘోరానికి సంబంధించిన వీడియోను మీరు చూడండి.
https://twitter.com/CollinRugg/status/1785686468243112256