Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వర్షాకాల పార్లమెంటు సమావేశాల అనంతరం వివిధ రాష్ట్రాల పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లో పర్యటను ముగించుకున్న రాహుల్ గాంధీ.. శుక్రవారం జమ్ము కాశ్మీర్ లడఖ్‌లో పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో విజయవం సాధించడం కోసం రాహుల్ గాంధీ పర్యటనలను కొనసాగిస్తు్న్నారు. వచ్చే నెలలో భారత్ జోడో యాత్ర2ను ప్రారంభించే అవకాశం ఉన్నందు.. అంతకంటే ముందుగానే కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పర్యటనలు చేయాలని భావించిన రాహుల్ ఇలా పర్యటనలను కొనసాగిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ను తిలకించారు. అలాగే కొద్దిసేపు బైక్ రైడ్‌ను చేశారు. ఈ సందర్భంగా ప్రజలతోనూ మాట్లాడారు. దేశంలోని అన్ని వ్యవస్థలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) నడుపుతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. వ్యవస్థటన్నింటిలోనూ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్నారు.
Read also: Over Exercise: ఎక్సర్‌సైజ్ ఎక్కువగా చేస్తే సమస్యలు వస్తాయా..! నిజమెంత..?
కేంద్ర మంత్రుల్లో ఎవరిని అడిగినా తమ మంత్రిత్వ శాఖలను వాస్తవంగా నిర్వహిస్తున్నది తాము కాదని.. ఆర్‌ఎస్‌ఎస్ నియమించిన వ్యక్తులే నిర్వహిస్తున్నారని చెబుతారని రాహుల్ చెప్పారు. ప్రతి విషయంలోనూ ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తుల ప్రమేయం ఉంటోందన్నారు. అన్ని వ్యవస్థలనూ ఆర్‌ఎస్‌ఎస్సే నడుపుతోందని, ప్రతి వ్యవస్థలోనూ ఆర్‌ఎస్‌ఎస్ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని రాహుల్ తెలిపారు. లేహ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాహుల్ యువతతో మాట్లాడారు. అంతకుముందు రాహుల్ గాంధీ లేహ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌ను తిలకించారు. భారత దేశానికి 1947లో స్వాతంత్ర్యం లభించిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ స్వాతంత్ర్యం బలపడిందని చెప్పారు. ఎన్నో నిబంధనల సమాహారమే రాజ్యాంగమని తెలిపారు. రాజ్యాంగ దార్శనికతకు అనుగుణంగా వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా అమలు చేయాలన్నారు.